E-Paper
Advertisement

కోట్ల విలువైన పెయింటింగ్ కోసం క్రాక్ ఎక్కించే పనులు… నవ్వులు పూయించే థ్రిల్లింగ్ మూవీ

కోట్ల విలువైన పెయింటింగ్ కోసం క్రాక్ ఎక్కించే పనులు… నవ్వులు పూయించే థ్రిల్లింగ్ మూవీ
Advertisement

Comedy Drama OTT : ఓటీటీలో ఉన్న బెస్ట్ కామెడీ డ్రామాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాస్టర్ పీస్. The Grand Budapest Hotel అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ 2014లో వచ్చింది. మరి ఏకంగా నాలుగు ఆస్కార్లు గెలుచుకునేంతగా ఈ సినిమాలో ఏముంది ? ఈ మూవీ స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్

వెస్ ఆండర్సన్ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన కామెడీ-డ్రామా ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’. అద్భుతమైన విజువల్స్, కలర్ ప్యాలెట్, వినూత్నమైన కథనంతో రూపొందిన ఈ మూవీ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాను ప్రస్తుతం భారతదేశంలో JioHotstar చూడొచ్చు. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ మూవీ ఏకంగా 4 ఆస్కార్ అవార్డులను కొట్టేసి, సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. విభిన్నమైన విజువల్స్, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను మ్యాజిక్ చేస్తుంది ఈ మూవీ. ఈ మాస్టర్ పీస్ మూవీని కామెడీ డ్రామాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వొద్దు.

కథలోకి వెళ్తే…

Advertisement

‘జుబ్రోవ్కా’ అనే యూరోపియన్ దేశంలో ఉన్న గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. 1930ల కాలంలో ఆ హోటల్‌ కు మేనేజర్గా పని చేసి ఉంటాడు మొన్సియర్ గుస్టావ్. అతను అక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే హోటల్‌ కు వచ్చే రిచ్ వృద్ధ మహిళలను తన మాటలతో, చేతలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. జీరో ముస్తఫా (టోనీ రెవోలోరి) అనే ఒక కొత్త లాబీ బాయ్ ఇతని అండర్ లోనే పని చేస్తూ ఉంటాడు. దీంతో ఇద్దరి మధ్య గురు-శిష్యుల బంధం స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది.

Also Read : ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న అదిరిపోయే సినిమాలు… యాక్షన్ థ్రిల్లర్ నుంచి హారర్ వరకు

Advertisement

గుస్టావ్‌ కు అత్యంత సన్నిహితురాలు ‘మేడమ్ డి.’ (టిల్డా స్వింటన్). వందల కోట్లకు అధిపతి అయిన ఆవిడ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. విచిత్రం ఏంటంటే ఆమె తన వీలునామాలో అత్యంత విలువైన ‘బాయ్ విత్ యాపిల్’ అనే పురాతన పెయింటింగ్‌ను గుస్టావ్‌ పేరు మీద రాస్తుంది. ఆమె క్రూరమైన కొడుకు దిమిత్రి (యాడ్రియన్ బ్రాడీ)కు ఈ విషయం అస్సలు నచ్చదు. దీంతో తన తల్లిని చంపింది గుస్టావే అని కేసు పెట్టి జైలుకు పంపుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జైలుకు వెళ్లేముందు గుస్టావ్, జీరో కలిసి ఆ పెయింటింగ్‌ ను దొంగిలిస్తారు. ఆ కోటీశ్వరురాలి కొడుకుకు తెలియకుండా దాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచేస్తారు. మరి గుస్తావ్ జైలు నుంచి ఎలా బయట పడ్డాడు ? తాను నిర్దోషిని అని ఎలా నిరూపించుకున్నాడు ?ఆ కోటీశ్వరురాలిని చంపిన నిజమైన హంతకుడు ఎవరు ? చివరికి ఆ పెయింటింగ్ ఏమైంది ? అన్నది స్టోరీ. సినిమాలో మంచు పర్వతాలలో జరిగే ఈ చేజింగ్ సీన్లు, స్కీయింగ్ ఫైట్లు ఫన్నీగా ఉండడమే కాదు, నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే క్యూరియాసిటీని కూడా పెంచుతాయి.

Tags

Related News

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×