E-Paper
Advertisement

Crime Thriller OTT : హీరోయిన్ ఇంట్లో హిడెన్ కెమెరా… నరకం చూపించే మిస్టీరియస్ మ్యాన్

Crime Thriller OTT : హీరోయిన్ ఇంట్లో హిడెన్ కెమెరా… నరకం చూపించే మిస్టీరియస్ మ్యాన్
Advertisement

Crime Thriller OTT : ఈ మధ్య వెబ్ సిరీస్ లను కుదించి దానినే సినిమాగా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను, సినిమాగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది హీరోయిన్ ని ఇష్టపడే ఒక పిచ్చి అభిమాని, ఆమె జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ  , ఆమెకు తెలియకుండానే ఒక సినిమా తీయాలని ప్రయత్నించే సైకో థ్రిల్లర్ కథ. పిచ్చి అభిమానం ఎలా ఒక ప్రమాదకరమైన ఉన్మాదంగా మారుతుందో ఈ సినిమా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘డేట్ విత్ సాయి’ (Date with Saie) 2018లో విడుదలైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో సాయి తమ్హంకర్, రోహిత్ కోకాటే మెయిన్ రోల్‌లో నటించారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ గ్రిప్పింగ్ కథ జ్ఞానేష్ జోటింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. మొత్తం 9 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ని 2 గంటల 10 నిమిషాల సినిమాగా కుదించి 2025 డిసెంబర్ 19న ZEE5లో మళ్లీ రిలీజ్ చేశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మరాఠీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయిన సాయి తంహంకర్ కు, రఘునాథ్ అనే వ్యక్తి వీరాభిమానిగా ఉంటాడు. అయితే ఆమెతో ఒక గొప్ప సినిమా తీయాలనేది అతని పిచ్చి కోరిక. ఈ నేపథ్యంలో రఘునాథ్ తనను తాను హిమాన్షు అనే బ్యాంకర్ అని పరిచయం చేసుకుని, ఒక ప్రమాదం నుండి సాయిని కాపాడి ఆమె నమ్మకాన్ని పొందుతాడు. సాయికి తెలియకుండానే రఘునాథ్ ఆమె చుట్టూ, ఆమె ఇంటిలో సీక్రెట్ కెమెరాలను అమర్చుతాడు. ఆమె ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ, ఆమె జీవితాన్నే ఒక సినిమాగా మార్చడానికి ప్రయత్నిస్తాడు.

అంతేకాకుండా ఆమె ఫోన్‌ను కూడా హ్యాక్ చేసి ఆమె వ్యక్తిగత జీవితాన్ని రఘునాథ్ లైవ్ లో చూడటం మొదలుపెడతాడు. హిమాన్షు ఒక బ్యాంకర్ కాదని, తనను వేధిస్తున్న స్టాకర్ అని సాయికి తెలిసినప్పుడు కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. చివరికి అతను తన సినిమా ముగింపు కోసం ఆమెను కిడ్నాప్ కూడా చేస్తాడు. మరి రఘునాథ్ అనుకున్నది సాధిస్తాడా ? కథ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను,ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  30 గంటలు సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా… అడుగడుగునా ట్విస్టులు… ఊహించని మలుపులు

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×