E-Paper
Advertisement

Vande Bharat sleeper vs Amrit Bharat Express: వందే భారత్ స్లీపర్ vs అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!

Vande Bharat sleeper vs Amrit Bharat Express:  వందే భారత్ స్లీపర్ vs అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!
Advertisement

భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా ఊహించని అభివృద్ధిని సాధించింది. అత్యాధునిక వందేభారత్, నమో భారత్, అమృత్ భారత్ లాంటి రైళ్లు ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టాయి. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. వీటిలో వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒకటి ప్రీమియం, హై స్పీడ్ సౌకర్యంపై దృష్టి సారించగా, మరొకటి సరసమైన, మాస్ ట్రాన్స్ పోర్ట్ మీద దృష్టి పెట్టింది. ఈ రెండు రైళ్ల మధ్య వ్యత్యాసాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వందే భారత్ స్లీపర్ రైలు గురించి..

వందే భారత్ స్లీపర్  సుదూర రాత్రిపూట ప్రయాణం కోసం తయారైన సెమీ హై స్పీడ్ రైలు. పూర్తిగా ఏసీ కోచ్ లను కలిగి ఉంటుంది. ఇది చైర్ కార్ సీటింగ్‌కు బదులుగా స్లీపింగ్ బెర్త్‌లను కలిగి ఉంటుంది.  ఈ రైలు లేటెస్ట్ రైల్ సెట్ టెక్నాలజీ,  మెరుగైన క్రాష్‌ వర్తినెస్, ఆటోమేటిక్ డోర్లు, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ తో నిర్మించబడింది. రాజధాని ఎక్స్‌ ప్రెస్ లాంటి  ప్రీమియం సుదూర రైళ్లను భర్తీ చేయడానికి రూపొందించారు. ఇది వేగవంతమైన ప్రయాణం, అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తుంది.

అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ గురించి..

Advertisement

అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ అనేది స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లపై ఆధారపడే సాధారణ ప్రయాణీకుల ప్రయాణ అనుభవాన్ని  మెరుగుపరచడానికి తీసుకొచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ, లాంగ్ రేంజ్ రైలు. ప్రీమియం రైళ్ల మాదిరిగా కాకుండా, ఎక్కువ సామర్థ్యం, ​​శుభ్రతను బేస్ చేసుకుని తీసుకురాబడింది. అమృత్ భారత్ రైళ్లు నాన్ ఏసీ,  ఎక్కువ ప్రయాణీకుల డిమాండ్ ఉన్న రద్దీ మార్గాల్లో నడపడానికి రూపొందించబడ్డాయి. ఛార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి.

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ మధ్య తేడాలు

వందే భారత్ స్లీపర్:  ఇది ప్రీమియం సెమీ హై స్పీడ్ రైలు.  సౌకర్యం, వేగంతో పాటు పూర్తిగా AC స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. రాత్రిపూట సౌకర్యం మరియు దీర్ఘకాలిక ప్రయాణానికి లేఅవుట్ ఆప్టిమైజ్ చేయబడింది. ఈ రైలు గంటకు 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు  ఉంటాయి. సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.  అధునాతన బోగీల్లో స్మార్ట్ డిస్‌ ప్లేలు, సెన్సార్లు, CCTVలు ఉంటాయి.  టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది.

Advertisement

అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్: చౌకైన లాంగ్ డిస్టెన్స్ ఎక్స్‌ ప్రెస్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాన్ AC స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి. గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. మాన్యువల్ డెర్లు ఉంటాయి. సాంప్రదాయ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. ప్రైమరీ ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు, పుష్ పుల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. తక్కువ ధర ఉంటుంది. మొత్తంగా వందే భారత్ స్లీపర్ వేగం, సౌకర్యం, సాంకేతిక పురోగతిని సూచిస్తుండగా, అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రజలకు సరసమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

Read Also:  వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×