E-Paper
Advertisement

నిద్రలేమితో మహిళలకు ముప్పు.. ఈ కొత్త పరిశోధన నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నిద్రలేమితో మహిళలకు ముప్పు.. ఈ కొత్త పరిశోధన నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

New study on women’s sleep: మహిళల ఆరోగ్యంపై జరిగిన తాజా అంతర్జాతీయ అధ్యయనాలు ఒక విస్తుపోయే నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పురుషులతో పోలిస్తే మహిళలకు నిద్ర లేమి సమస్యలు ఎక్కువగా ఉండటమే కాకుండా.. వారి నిద్ర అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. హార్మోన్ల మార్పులు, ఇంటి బాధ్యతలు మానసిక ఒత్తిడి మహిళల నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మహిళల్లో గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ అంతే కాకుండా మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త అధ్యయన విశేషాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మహిళల నిద్రపై సరికొత్త అధ్యయనం:
ఇటీవల హార్వర్డ్ , ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పరిశోధనల్లో మహిళల నిద్రకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. కేవలం 7 గంటల నిద్ర అందరికీ సరిపోదని, ముఖ్యంగా మహిళల మెదడు పని తీరుకు మరికొంత అదనపు విశ్రాంతి అవసరమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

1. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరం?
మహిళల మెదడు పురుషుల కంటే.. ఎక్కువ ‘మల్టీ టాస్కింగ్’ (ఒకేసారి అనేక పనులు చేయడం) చేస్తుంది. పగటి పూట మెదడును ఎక్కువగా ఉపయోగించడం వల్ల, అది తిరిగి శక్తిని పుంజుకోవడానికి పురుషుల కంటే సగటున 20 నుంచి 30 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

2. హార్మోన్ల ప్రభావం :
మహిళల జీవితంలో ప్రతి నేల వచ్చే పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ సమయాల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిలు మారినప్పుడు రాత్రిపూట మెలకువ రావడం, వేడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

3. ‘సర్కాడియన్ రిథమ్’ లో తేడాలు:
కొత్త అధ్యయనం ప్రకారం.. మహిళల అంతర్గత జీవ గడియారం పురుషుల కంటే సుమారు 6 నిమిషాలు వేగంగా నడుస్తుంది. దీని వల్ల మహిళలు రాత్రి త్వరగా అలసిపోవడం , ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం జరుగుతుంది. అయితే.. సామాజిక బాధ్యతల వల్ల వారు రాత్రి త్వరగా పడుకోలేకపోవడం వల్ల నిద్ర లోటు ఏర్పడుతోంది.

4. మానసిక ఆరోగ్యం, నిద్ర:
నిద్రలేమి వల్ల మహిళల్లో ‘కోర్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి. ఇది వారిని త్వరగా కోపానికి, నిరాశకు గురి చేస్తుంది. తగినంత నిద్ర లేని మహిళల్లో పోస్ట్-పార్టమ్ డిప్రెషన్ (ప్రసవానంతర బాధ) , యాంగ్జైటీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read: నిద్రలోనే ఎక్కువ మందికి హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? నిజమిదే !

5. గుండె ఆరోగ్యంపై ప్రభావం:
తక్కువ నిద్రపోయే మహిళల్లో రక్తపోటు పెరగడం , గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు 25% ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి, బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది.

మంచి నిద్ర కోసం చిట్కాలు:
స్థిరమైన సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.

డిజిటల్ డిటాక్స్: పడుకోవడానికి గంట ముందు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ పక్కన పెట్టాలి.

మెగ్నీషియం రిచ్ ఫుడ్: ఆకుకూరలు, గింజలు వంటి మెగ్నీషియం ఉన్న ఆహారం నిద్రకు తోడ్పడుతుంది.

పగటి నిద్ర వద్దు: మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు నిద్రపోవడం రాత్రి నిద్రను పాడు చేస్తుంది.

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×