E-Paper
Advertisement

పదేళ్ల క్రితం క్లోజ్ అయిన హత్య కేసు రీఓపెన్… లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అల్టిమేట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్

పదేళ్ల క్రితం క్లోజ్ అయిన హత్య కేసు రీఓపెన్… లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అల్టిమేట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Crime Thriller Series on OTT : ఓటీటీలో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇది పోలీస్ డిపార్ట్‌మెంట్ రాజకీయాలను చాలా సీరియస్‌గా, రియలిస్టిక్‌గా చూపించే సిరీస్. ఇందులో యాక్షన్ కంటే ఇద్దరు లీడ్ క్యారెక్టర్ల మధ్య జరిగే సైకలాజికల్ మైండ్ గేమ్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌ మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్‌ఫెక్ట్ సిరీస్.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ ‘క్రిమినల్ రికార్డ్’ (Criminal Record). ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ జనవరి 2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోగా, రెండవ సీజన్ ఏప్రిల్ 2026లో మరింత ఉత్కంఠభరితమైన యాక్షన్ స్టంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాఫ్టా అవార్డు నామినీ పాల్ రుట్‌మన్ రూపొందించిన ఈ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా Apple TV, Prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన ‘టాడ్ ప్రొడక్షన్స్’, ‘STV స్టూడియోస్’ కలసి నిర్మించిన ఈ సిరీస్‌ లో లీడ్ రోల్స్ ప్లే చేసిన పీటర్ కాపాల్డి, కుష్ జంబోలు నటులుగానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా కూడా వ్యవహరించారు. ఈ సిరీస్ ప్రస్తుతం టాప్ రేటెడ్ క్రైమ్ డ్రామాలలో ఒకటిగా కొనసాగుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సిరీస్ ఒక లండన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి కంట్రోల్ రూమ్‌కి ఒక అమ్మాయి నుండి అర్జెంట్ ఫోన్ కాల్ వస్తుంది. తన బాయ్‌ఫ్రెండ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, గతంలో అతను చేసిన ఒక మర్డర్‌కు వేరే అమాయకుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యత జూన్ లెంకర్ అనే యంగ్ అండ్ సిన్సియర్ ఉమెన్ ఆఫీసర్‌కి వస్తుంది. ఆమె పాత ఫైల్స్ తిరగేయగా, ఆ కేసును డీల్ చేసింది డిపార్ట్‌మెంట్‌లో బాగా పట్టున్న సీనియర్ ఆఫీసర్ డానియల్ హెగార్టీ అని తెలుస్తుంది. లెంకర్ నిజం కంపెట్టే ప్రయత్నాలు చేస్తుంటే, హెగార్టీ ఆమెను ప్రతి అడుగులోనూ అడ్డుకుంటూ మైండ్ గేమ్స్ ఆడతాడు. ఆ అమాయకుడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే లెంకర్ పట్టుదలకు, తన సీటును కాపాడుకోవాలనే హెగార్టీ ప్లాన్లకు మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ పోరాటమే మొదటి సీజన్ కథ.

ఇక రెండో సీజన్‌కు వచ్చేసరికి కథ మరింత ఊపందుకుంటుంది. లండన్‌లో జరిగే ఒక పొలిటికల్ ర్యాలీలో ఒక యువకుడిని దారుణంగా పొడిచి చంపేస్తారు. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ వల్ల ఒకరినొకరు అస్సలు నమ్మని లెంకర్, హెగార్టీ మళ్లీ కలవాల్సి వస్తుంది. ఒక మామూలు హత్య అనుకున్న కేసు కాస్తా, లండన్ నగరంలో పెద్ద బాంబు దాడి చేయాలనుకునే ఒక ప్రమాదకరమైన తీవ్రవాద ముఠా గుట్టుగా మారుతుంది. ఆ ఆయుధాల స్మగ్లర్లను పట్టుకోవడానికి హెగార్టీ నడిపే ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఆపరేషన్‌లో లెంకర్ కూడా భాగస్వామి అవుతుంది. ఆ ముఠా ప్లాన్‌ను వీళ్లు ఎలా తిప్పికొట్టారు ? ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయనేది మిగతా కథ.

Advertisement

Read Also : ఆత్మల సాయంతో మర్డర్ ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపులతో సాగే మైండ్ బ్లోయింగ్ సిరీస్

Related News

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

Big Stories

Advertisement
×