E-Paper
Advertisement

ఆత్మల సాయంతో మర్డర్ ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపులతో సాగే మైండ్ బ్లోయింగ్ సిరీస్

ఆత్మల సాయంతో మర్డర్ ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపులతో సాగే మైండ్ బ్లోయింగ్ సిరీస్
Advertisement

Psychological crime series : పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఓటీటీలో ఎప్పుడు వచ్చినా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంటెన్స్ గా ఉంటే ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకలాజికల్ క్రైమ్ సిరీస్ కొంచెం డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఇందులో క్రైమ్ థ్రిల్లర్లలో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు, చేజింగ్‌లు ఉండవు. మనకి బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయినప్పుడు మనసు ఎంతలా తల్లడిల్లిపోతుంది, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చూపిస్తారు ఇందులో. హీరో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతూ మర్డర్ మిస్టరీని ఛేదించే విచిత్రమైన స్క్రీన్‌ప్లే కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ సైకలాజికల్ క్రైమ్ సిరీస్ పేరు ‘రివర్’ (River). ఎమ్మీ అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ స్క్రీన్‌రైటర్ అబి మోర్గాన్ అందించిన స్క్రిప్ట్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది. 2015 లో వచ్చిన ఈ సిరీస్‌లో జాన్ రివర్‌గా స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, స్టీవీగా నికోలా వాకర్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ ఆరు ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. రివ్యూ వెబ్‌సైట్ ఐయండిబిలో దీనికి 8.0/10 రేటింగ్‌తో పాటు, Rotten Tomatoesలో 95% క్రిటిక్స్ స్కోర్ సాధించి ఇదొక మాస్టర్‌పీస్‌గా నిలిచింది. ముఖ్యంగా లీడ్ రోల్ పోషించిన స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ నటనకు ఇంటర్నేషనల్ వైడ్‌గా అవార్డులు వచ్చాయి. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

లండన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే జాన్ రివర్ అనే ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్ ఉంటాడు. ఒక రోజు అతని కళ్ల ముందే అతని ప్రాణ స్నేహితురాలు, పోలీస్ పార్ట్‌నర్ అయిన స్టీవీని ఎవరో కార్లో వచ్చి దారుణంగా కాల్చి చంపేస్తారు. ఈ షాక్ నుంచి రివర్ అస్సలు కోలుకోలేకపోతాడు. దీంతో అతనికి ఒక విచిత్రమైన మానసిక సమస్య మొదలవుతుంది. చనిపోయిన స్టీవీ దయ్యంలా కాకుండా, నార్మల్ మనిషిలాగే రివర్‌కి కంటికి కనిపిస్తూ, పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు భ్రమ కలుగుతుంది.

తనకి పిచ్చి ముదిరిందని తెలిస్తే ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతూ, ఆ విషయాన్ని పై అధికారులకి తెలియకుండా, స్టీవీని చంపిన అసలు హంతకుడు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు జాన్ . ఇక స్టీవీని చంపింది ఎవరో వెతికే కొద్దీ రివర్‌కి ఎన్నో షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ ట్విస్టులు చూసిన ఆడియన్స్ కి కూడా పిచ్చెక్కిపోద్ది. మరి ఆ ట్విస్టులు ఏమిటి ? స్టీవీని ఎవరు, ఎందుకు చంపారు ? జాన్ తెలుసుకున్న నిజాలు ఏమిటి ? ఈ కథకు ఎలాంటి ముగింపు ఉంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : అప్పుల ఊబి నుండి బయటపడటానికి మాజీ పోలీస్ డేంజరస్ ప్లాన్… ఓటీటీలో పర్ఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్

Tags

Related News

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×