Psychological science fiction thriller series : మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో మెదడుకు పదును పెట్టేలా సాగుతోంది ఒక సస్పెన్స్ సిరీస్. ఇప్పటికే ఇది రెండు సీజన్లతో భారీ విజయం సాధించి, ఇప్పుడు సీజన్ 3తో కూడా అలరించడానికి సిద్దమవుతోంది. ఇది హారర్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తోంది. ఈ సిరీస్ ఒకవైపు ఒక సోషల్ వర్కర్ జీవితంలో జరిగే వింతలను చూపిస్తూనే, మరోవైపు నగరంలో జరిగే క్రూరమైన సీరియల్ మర్డర్స్ చుట్టూ సాగుతుంది. కథ చూస్తున్నంత సేపు అసలు ఏం జరుగుతోందినే క్యూరియాసిటీని కలిగిస్తూ, చివరి వరకు ఊహించని ట్విస్టులతో సాగడమే ఈ సిరీస్ ప్రత్యేకత. థ్రిల్ల ర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది.
2022లో వచ్చిన ఈ బ్రిటిష్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది డెవిల్స్ హవర్’ (The Devil’s Hour). టామ్ మోరన్ సృష్టించిన ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ మోఫాట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్ 6 ఎపిసోడ్‌లతో 2022 అక్టోబర్ 28న Prime Video ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఇది ఐయండిబిలో 7.6 రేటింగ్, Rotten Tomatoes లో 100% టాప్ స్కోర్ ను సాధించింది. కథను పూర్తిగా ముగించేలా ఈ సిరీస్‌ను మూడు సీజన్లుగా ప్లాన్ చేశారు. దాని ప్రకారం 2024 అక్టోబర్‌లో సీజన్ 2 విజయవంతంగా విడుదల కాగా, ఈ కథకు ముగింపు పలికే ఆఖరి సీజన్ 3 షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది చివరిలో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కథ లూసీ అనే ఒక సోషల్ వర్కర్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ఎనిమిదేళ్ల కొడుకు ఐజాక్ ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరితోనూ కలవడు, నవ్వడు, కనీసం ఏడవడం కూడా తెలియని ఒక వింత మనస్తత్వం ఉన్న పిల్లోడు. ఇక లూసీకి ప్రతి రోజూ రాత్రి సరిగ్గా 3:33 AM కి ఒకే టైమ్‌కి మెలకువ వచ్చేస్తుంది. ఆ టైమ్‌లో ఆమెకు దారుణమైన భయంకరమైన కలలు వస్తుంటాయి. అంతేకాదు తను ఎప్పుడూ చూడని కొన్ని దారుణమైన సంఘటనలు ఆల్రెడీ చూసినట్లు ఒక వింత ఫీలింగ్ ఆమెను వెంటాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏదో తెలియని నెగటివ్ ఎనర్జీ ఉందని ఆమె భయపడుతూ ఉంటుంది.
ట్విస్ట్ ఏంటంటే.. అదే టైమ్‌లో నగరంలో కొన్ని వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి, లూసీ రాత్రిపూట చూసే కలలకి ఏదో ఊహించని కనెక్షన్ ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత గిడియన్ అనే ఒక సైకో క్రిమినల్ పోలీసులకు దొరుకుతాడు. అతను లూసీని మాత్రమే కలవాలని పట్టుబడతాడు. గిడియన్ లూసీతో మాట్లాడుతూ.. నాకు గతం, భవిష్యత్తు అన్నీ తెలుసు, నేను టైమ్ లూప్‌లో బతుకుతున్నానంటూ కొన్ని షాకింగ్ నిజాలు చెప్తాడు. అసలు లూసీకి, ఆ సైకోకి, ఆ హత్యలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లూసీ కొడుకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అనే సస్పెన్స్ మిస్టరీతో ఈ సిరీస్ సాగుతుంది.
Read Also : బ్రిటీష్ అహంకారాన్ని మట్టి కరిపించిన అడవి బిడ్డ… ఓటీటీలోకి క్రేజీ రివేంజ్ థ్రిల్లర్