E-Paper
Advertisement

Korean Suspense Thriller OTT : చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళకు మాత్రమే కన్పించే షాప్… దిమ్మతిరిగే ట్విస్టులు

Korean Suspense Thriller OTT : చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళకు మాత్రమే కన్పించే షాప్… దిమ్మతిరిగే ట్విస్టులు
Advertisement

Korean Suspense Thriller OTT : ఓటీటీలో కొరియన్ సిరీస్ లకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వీటికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్ లు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ కథ ప్రధానంగా ఒక బస్సు ప్రమాదం చుట్టూ, ఆ ప్రమాదంలో కోమాలో ఉన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. కోమా నుంచి బయట పడటానికి వీళ్ళ ఆత్మలు చేసే పోరాటమే ఈ సిరీస్. దీనిని చూస్తే అలా చూస్తుండిపోతారు అంతే. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2024లో వచ్చిన దక్షిణ కొరియా మిస్టరీ హర్రర్ టెలివిజన్ సిరీస్ ‘లైట్ షాప్’ (Light Shop). దీనికి హీ-వాన్ దర్శకత్వం వహించారు. ఇందులో జు జి-హూన్, పార్క్ బో-యంగ్, కిమ్ సియోల్-హ్యూన్, బే సంగ్-వు వంటి నటులు నటించారు. ఇది 2024 డిసెంబర్ 4న Jio hotstarలో విడుదలైంది. ఇది Jio hotstarలో అతిపెద్ద కొరియన్ ఒరిజినల్ ప్రీమియర్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద కొరియన్ సిరీస్ గా నిలిచింది.

కథ ఏమిటి అంటే

Advertisement

ఈ లైట్ షాప్’ కథ ఒక భయంకరమైన బస్సు ప్రమాదం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన వ్యక్తులు, భూలోకానికి, పరలోకానికి మధ్య ఉండే ఒక వింతైన ‘లింబో’ (Limbo) ప్రపంచంలో చిక్కుకుపోతారు. ఆ చీకటి ప్రపంచంలో ఒక లైట్ల దుకాణం ఉంటుంది. దాని యజమాని వోన్-యంగ్ అక్కడికి వచ్చే ఆత్మలకు మార్గదర్శిగా ఉంటాడు. అక్కడ ఉన్న వ్యక్తులు తిరిగి ప్రాణాలతో భూమిపైకి వెళ్లాలంటే, ఆ షాపులోని లైట్ బల్బులను వెలిగించుకోవాలి. ఆ బల్బులు వాళ్ళకి తిరిగి ప్రాణం పోస్తాయి.

ఈ క్రమంలో హ్యున్-మిన్ అనే యువకుడు తన ప్రియురాలు జి-యంగ్ మరణించిందనే బాధతో కృంగిపోతుంటాడు. అతను కూడా కోమాలోకి పోతాడు. కానీ వాస్తవానికి ఆమె ఆత్మగా మారి అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటుంది. కోమాలో ఉండి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, మరణాన్ని ఎదురించి తిరిగి రావడానికి చేసే పోరాటమే ఈ సిరీస్.

Advertisement

Read Also :  చెట్లు కాలిపోయే రహస్య సంఘటనల చుట్టూ తిరిగే కథ… క్షణక్షణం ఉత్కంఠభరితం

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×