E-Paper
Advertisement

కోమాలో భర్త మరిది ప్రేమలో భార్య … పెళ్లైన కొత్తలోనే ఊహించని మలుపులు

కోమాలో భర్త మరిది ప్రేమలో భార్య … పెళ్లైన కొత్తలోనే ఊహించని మలుపులు
Advertisement

Romantic Movie OTT : కొన్ని రొమాంటిక్ సినిమాలు చాలా డిఫఫెరెంట్ గా ఉంటాయి. అందులోనూ ట్రయాంగిల్ లవ్ అంటే క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ సినిమా యమ క్రేజీగా ఉంటుంది. ఈ సినిమా కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో చాలా ఘాటైన రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. ఇది కేవలం పెద్దలకు మాత్రమే. సినిమాలోని విజువల్స్ కూడా చాలా రిచ్‌గా ఉంటాయి. ముఖ్యంగా మంచు కొండలు, అందమైన లోయల మధ్య తీసిన సీన్లు సినిమాకి ఒక రకమైన మూడ్‌ని తీసుకొస్తాయి. ఈ కథ భర్త కోమాలోకి వెళ్ళాక భార్య మరిది తో సంబంధం పెట్టుకుంటుంది. ఆ తరువాత ఉంటుంది చూడు సినిమా నా సామి రంగా, చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సీక్రెట్ లవ్’ (Secret Love). 2010లో వచ్చిన ఈ సినిమాకు ర్యూ హూన్ దర్శకత్వం వహించారు. ఇందులో యూ జి-టే, జిన్-సియో ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. యూ జి-టే ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఈ సినిమాలోని హీరో యూ జి-టే, హీరోయిన్ యూన్ జిన్-సియో, ఇంతకుముందు సూపర్ హిట్ అయిన ‘ఓల్డ్ బాయ్’ (Old Boy) అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరూ కలిసి నటించిన క్రేజీ మూవీ ఇది. ప్రస్తుతం ఇది Viki, plex ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యోన్-యి అనే అమ్మాయి జిన్-వూ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లయిన రెండు నెలలకే ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్ జరిగి మొగుడు జిన్-వూ కోమాలోకి వెళ్లిపోతాడు. హాస్పిటల్ బెడ్డు మీద శవంలా పడి ఉన్న భర్తను చూసి ఆ అమ్మాయి పిచ్చెక్కిపోతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు తన భర్త లాగే అచ్చు గుద్దినట్టు ఉండే అతని కవల తమ్ముడు జిన్-హో పరిచయం అవుతాడు. ఇక నుంచి అసలు కథ ఉంటుంది. భర్త కోమాలో ఉన్నాడని బాధపడుతున్న టైంలో, సేమ్ టు సేమ్ మొగుడి పోలికలతో ఉన్న తమ్ముడు దగ్గరవ్వడంతో యోన్-యి మనసు పక్కదారి పడుతుంది.

ఇప్పుడు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలవుతుంది. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, ఎంజాయ్ చేస్తున్న టైంలోనే అసలైన ట్విస్ట్ వస్తుంది. చస్తాడనుకున్న మొగుడు జిన్-వూ అనూహ్యంగా కోమాలోంచి కళ్ళు తెరుస్తాడు. కోమాలోంచి బయటపడ్డ మొగుడికి తన పెళ్ళాం, తమ్ముడి మధ్య ఏం జరిగిందో అర్థమైపోతుంది. దీంతో ఆ ఇంట్లో నరకం మొదలవుతుంది. తమ్ముడు అన్న ప్లేస్ కొట్టేయాలని చూస్తాడు, అన్న తన భార్యను వదులుకోలేక రగిలిపోతాడు. వీళ్ల మధ్యలో ఆ అమ్మాయి ఎవరి వైపు ఉండాలో తెలియక నలిగిపోతుంది. చివరికి అసలు ఆ కోమాలోంచి వచ్చింది అన్నేనా లేక తమ్ముడా అనే ఒక పెద్ద సస్పెన్స్ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : కష్టాలను జయించిన ఒక పవిత్ర ఆత్మ ప్రయాణం… అవార్డులు, ప్రశంసలతో హోరెత్తిన సినిమా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×