E-Paper
Advertisement

Crime Thriller OTT : డిజిటల్ అరెస్ట్.. స్కామర్లకు చుక్కలు చూపించే అమ్మాయిలు, క్లైమాక్స్ భలే ఉంటుంది

Crime Thriller OTT : డిజిటల్ అరెస్ట్.. స్కామర్లకు చుక్కలు చూపించే అమ్మాయిలు, క్లైమాక్స్ భలే ఉంటుంది
Advertisement

Crime Thriller OTT : ప్రస్తుతం మన దేశంలోనే కాదు ఎక్కడ చూసినా ఈ ఆన్లైన్ మోసాలు ఎక్కువ అయ్యాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన ఒక లేటెస్ట్ థాయ్ క్రైమ్ థ్రిల్లర్ లో కాల్ సెంటర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో ముగ్గురు ఆడవాళ్లు కలిసి, ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్‌ని ఎలా ఎదుర్కొన్నారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సుమారు 2 గంటల 15 నిమిషాలతో గ్రిప్పింగ్‌గా, సినిమా అంతా ఒక రకమైన డార్క్ థీమ్‌లో ఎక్కడా బోరు కొట్టకుండా సాగిపోతుంది. అంతేకాదు ఈ థాయ్ సినిమా తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. ఇంకేం ఫ్యామిలీతో కలసి ఎంచక్కా ఈ సినిమాని చూసేయచ్చు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ థాయ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది రెడ్ లైన్’ (The Red Line). థాయ్ భాషలో దీన్ని ‘సేన్ తాయ్ సాయ్ లుయాంగ్’ (Sen Tai Sai Luang) అని కూడా పిలుస్తారు. దీనికి డైరెక్టర్ సితిసిరి మోంగ్కోల్సిరి. ఇతను గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయిన ‘హంగర్’ (Hunger) సినిమాను, ‘గర్ల్ ఫ్రమ్ నోవేర్’ (Girl from Nowhere) సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. అందుకే ఈ సినిమా మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో నిత్తా జిరాయుంగ్యుర్న్, ఎస్తేర్ సుప్రీలీలా, చుటిమా మహోలకుల్ ముఖ్య పాత్రలు పోషించారు. వీళ్ళంతా థాయ్‌లాండ్‌లో చాలా పాపులర్ నటులు. ఈ సినిమా 2026 మార్చి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవరో ఫోన్ కాల్‌తో మాయం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కనిపిస్తుంది. ముగ్గురు మిడిల్ క్లాస్ ఆడవాళ్లు ఈ కథలో ఉంటారు. ఒకామె హౌస్ వైఫ్, ఇంకొకామె ఫిజియోథెరపిస్ట్, మరొకరు చిన్న బిజినెస్ చేసుకునే అమ్మాయి. వీళ్ళ ముగ్గురి లైఫ్ సేవింగ్స్‌ని ఒక కాల్ సెంటర్ స్కామ్ గ్యాంగ్ కొట్టేస్తుంది. పోలీసుల చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో, మన డబ్బు మనం ఎలాగైనా తెచ్చుకోవాలని ఈ ముగ్గురు కసిగా రంగంలోకి దిగుతారు. ఇప్పుడు వీళ్ళకి తోడుగా ఒక తెలివైన హ్యాకర్ కుర్రాడు తోడవుతాడు. అతను కంప్యూటర్ ముందు కూర్చుని లోగుట్టులన్నీ బయట పెడుతుంటే, ఈ ముగ్గురు ప్రాణాలకు తెగించి ఆ మోసగాళ్ల అడ్డాలోకి వెళ్తారు.

ఆ కాల్ సెంటర్ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవడనేది తెలుసుకున్న కొద్దీ స్టోరీ ఊపందుకుంటుంది. కేవలం డబ్బు కోసమే కాకుండా, వేలమందిని నిలువునా ముంచుతున్న ఆ నెట్‌వర్క్‌ను ఎలాగైనా ఖతం చేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తారు. చివరికి ఆ ముఠా నాయకుడైన ఊడ్ ని   పట్టుకోవడానికి వీళ్ళు వేసే ఎత్తుగడలు, చేసే ఫైట్లు మామూలుగా ఉండవు. సాదాసీదాగా కనిపించే ఆడవాళ్లు తలుచుకుంటే ఎంతటి నేరగాళ్లనైనా మట్టి కరిపించగలరని ఈ సినిమాలో చూపించారు. పక్కా క్రైమ్ థ్రిల్లర్ కావడంతో సీటు అంచున కూర్చోబెట్టేలా సినిమా సాగుతుంది. మోసగాళ్ల ఆట కట్టించి తమ డబ్బును వాళ్లు తిరిగి తెచ్చుకున్నారా లేదా అనేదే క్లైమాక్స్.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×