E-Paper
Advertisement

Sperm in space: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

Sperm in space: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి
Advertisement

కలలు బాగుంటాయి. అవి సాకారమైతే ఇంకా ఇంకా బాగుంటాయ్. మరి మీకు ఎప్పుడైనా చంద్రుడి మీదకు వెళ్లిపోయి, ఇల్లు కట్టేసుకుని.. చక్కగా సంసారం చేసేస్తూ.. గంపెడు పిల్లలతో అక్కడ జనాభా పెంచేయాలని కలలుగన్నారా? అయితే, మీ కల.. కలగానే మిగిలిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల ఓ బాంబు పేల్చారు. అంతరిక్షంలో మగతనం మంచిగా ఉన్నా.. వారి వీర్యం మాత్రం వింతగా ప్రవర్తిస్తుందట. ఇందుకు గల కారణాలు ఏమిటనేది కూడా పరిశోధకులు వివరించారు.

భూమిపై ఉన్నది.. చంద్రుడిపై లేనిది ఏమిటీ?

భూమిపై మనిషితోపాటు ఎన్నో రకాల జాతులు జీవిస్తున్నాయి. అవన్నీ కూడా చక్కగా సంపర్కం చేసుకోగలవు.. పిల్లలను కూడా కనేస్తాయి. కొన్నయితే గుడ్లు పెడతాయి. ఇలా ఏదో ఒక రూపంలో సంతానాన్ని అయితే డెవలప్ చేసుకుంటాయి. మనం ఈ భూమి మీదకు రాగానే.. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడతాం. మన శరీరం.. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నీ దానికి అనుకూలంగానే ఉంటాయి. మరి ఇక్కడిలాగానే చంద్రుడిపై కూడా జరగాలి కదా అని అనుకుంటాం. అయితే, అక్కడ లేనిది.. భూమిపై ఉన్నది. అదే గురుత్వాకర్షణ శక్తి. దాని పైనే మన పుట్టుక ఆధారపడి ఉంది. పురుషుడు విడుదల చేసే వీర్యం.. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్త్రీ అండాలకు చేరుకుంటుంది. ఆ తర్వాతి ప్రాసెస్ గురించి మీకు తెలిసిందే. గురుత్వాకర్షణ శక్తి సక్రమంగా ఉంటేనే ఇదంతా సాధ్యం.

చంద్రుడిపై ఎందుకంత కష్టం?

Advertisement

ఒక్కసారి మనం భూమి కక్ష్యను దాటి అంతరిక్షంలోకి వెళ్లామంటే.. గురుత్వాకర్షణ శక్తే ఉండదు. మన శరీరం కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. రక్తప్రవాహం కూడా గతి తప్పుతుంది. అందుకే అంతరిక్షంలో నెలలు, ఏళ్ల తరబడి గడిపేందుకు వీలుగా వ్యోమగాములకు ట్రైనింగ్ ఇస్తారు. వారి హెల్త్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అంతరిక్షం నుంచి తిరిగి భూమి మీదకు చేరుకున్నాక.. వారు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. అంతరిక్షంలో ఉండే పరిస్థితులే చంద్రుడి మీద కూడా ఉంటాయి. భూమితో పోల్చితే చంద్రుడి సైజు చాలా తక్కువ. దాని ద్రవ్యరాశి, వ్యాసార్థం తక్కవగా ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకు భూమి మీద మీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రుడిపై 10 కిలోలు ఉన్న అనుభవం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్య కణాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

వీర్య కణాలు దారితప్పుతాయా?

చంద్రుడు, ఆ తర్వాత అంగారక గ్రహం పైకి వెళ్లేందుకు NASA ప్రారంభించిన ఆర్టెమిస్ మిషన్‌లో ఆస్ట్రేలియా కూడా ఒక భాగం. ముఖ్యంగా ఆయా గ్రహాల్లో నివాసాలు ఏర్పరుచుకోవడం, మైనింగ్ తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.. వీర్యకణాలపై ప్రయోగం చేశారు. ప్రయోగశాలలో వీర్య కణాలను సూక్ష్మగురుత్వాకర్షణకు గురిచేసినప్పుడు.. ఒక లక్ష్యం లేనట్లు గిరగిరా తిరిగాయట. తోక భాగం పైకి.. తల కిందకు.. ఏది ఎటు వేళ్లాలో తెలియనట్లు తికమక పడ్డాయట. చంద్రుడిపై లైంగిక కలయిక తర్వాత కూడా అవి అలాగే ప్రయత్నిస్తాయని, నేరుగా అండానికి చేరుకోలేవని తేల్చేశారు. అంటే.. అక్కడి మానవ వీర్యం ఉత్తి నురగతో సమానం అన్నమాట.

ఎలా తెలుసుకున్నారు?

Advertisement

అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఎదుర్కొనే భారరహిత స్థితి (అంటే గాల్లో తేలుతున్న అనుభవం లేదా బరువును కోల్పుతున్న అనుభవం) ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అడిలైడ్ పరిశోధకులు 3D క్లినోస్టాట్ అనే యంత్రాన్ని ఉపయోగించారు. దాని ఆధారంగానే.. వీర్య కణాలపై కూడా అదే స్థాయిలో సూక్ష్యగురుత్వాకర్షణ శక్తిని ప్రయోగించారు. ఆ తర్వాత మహిళల యోని తరహాలో గందరగోళంగా ఉండే ఒక ప్రత్యుత్పత్తి మార్గంలోకి వాటిని విడిచారు. అక్కడ శుక్ర కణాలు.. స్త్రీ అండాలను కనుక్కొనే విషయంలో గందరగోళానికి గురయ్యాయి. ఎప్పటికీ అండానికి చేరుకోలేవని, మధ్యలోనే నశిస్తాయని, దాని వల్ల పిల్లలు పుట్టడం అసాధ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వివరాలను ‘కమ్యునికేషన్ బయాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ ప్రయోగం కోసం మనుషుల వీర్యాన్నే కాకుండా, ఎలుకలు, పందులవి కూడా ఉపయోగించారు.

కానీ, చిన్న ఆశ..

శుక్ర కణాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నా.. భవిష్యత్తులో అవి పిండాన్ని ఏర్పరిచే స్థాయికి చేరుకోగలవని పరిశోధకులు ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రయోగంలో 40 శాతం వరకు శుక్ర కణాల సంఖ్య తగ్గినట్లు గమనించామన్నారు. రానున్న కాలంలో ఆరోగ్యకరమైన పిండాలు ఏర్పడటం సాధ్యమేనని స్పష్టం చేశారు.

గతంలోనూ పరిశోధనలు.. ఏం తేలిందంటే?

అంతరిక్షంలో పునరుత్పత్తిపై గతంలో కూడా చాలా పరిశోధనలు జరిగాయి. అడిలైడ్ విశ్వవిద్యాలయం ఆ విషయాలను కూడా తమ అధ్యయనాల్లో పేర్కొంది. 1987లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఎలుకల వృషణాల ద్రవ్యరాశి తగ్గిపోయింది. ఆ తర్వాత 1998లో కొలంబియా స్పేస్ షటిల్‌లో ఎలుకల పిండాలపై జరిగిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం తేలింది. ఏది ఏమైనా ప్రస్తుతం భూమి పైనా అనేక కారణాలతో సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరి, అంతరిక్షంలో సాధ్యమా కాదా అనేది మున్ముందు తెలుస్తుంది. అప్పటి వరకు మీ కలలను కంటిన్యూ చెయ్యండి.

Also Read: సముద్రంలోని నీరంతా ఇంకిపోతే.. ఇదిగో NASA రిలీజ్ చేసిన ఈ సీ-మ్యాప్ చూడండి

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×