E-Paper
Advertisement

Horror Movie OTT: దెయ్యాలను రప్పించే కొత్త ఆట… సరదాగా మొదలై చావు దాకా… వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Horror Movie OTT: దెయ్యాలను రప్పించే కొత్త ఆట… సరదాగా మొదలై చావు దాకా…  వణికిస్తున్న హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Movie OTT : ఓటీటీలో ఒక హారర్ మూవీ తెగ భయపెడుతోంది. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా ఫేమ్ అయిన డానీ, మైఖేల్ ఫిలిప్పో అనే కవల సోదరులు డైరెక్ట్ చేశారు. ఇది వాళ్ళ మొదటి ఫీచర్ ఫిల్మ్. సినిమాలో దెయ్యాలు పట్టినప్పుడు వచ్చే సీన్లు, ఆ భయంకరమైన శబ్దాలు ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, మొదటి సినిమాతోనే ఈ సోదరులు బాగా ఫేమస్ అయిపోయారు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఆస్ట్రేలియన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ పేరు ‘టాక్ టు మీ’ (Talk to Me). దీనిని డానీ, మైఖేల్ ఫిలిప్పో దర్శకత్వం వహించారు. ఇందులో సోఫీ వైల్డ్, అలెగ్జాండ్రా జెన్సన్, జో బర్డ్, ఓటిస్ ధంజీ, మిరాండా ఒట్టో, జో టెరాక్స్, క్రిస్ అలోసియో నటించారు. ఈ సినిమా 2023 జూలై 7న ఆస్ట్రేలియాలో A24 ద్వారా విడుదల అయింది. ఈ సినిమా కేవలం $4.5 మిలియన్ల (దాదాపు ₹37 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు $92 మిలియన్ల (దాదాపు ₹760 కోట్లు) వసూలు చేసి, A24 సంస్థకు అత్యధిక వసూళ్లు రాబట్టిన హర్రర్ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 2024 ఆస్ట్రేలియన్ అకాడమీ (AACTA) అవార్డుల్లో ఈ సినిమా ఏకంగా 8 అవార్డులను గెలుచుకుంది. వీటిలో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్ట్రెస్ (సోఫీ వైల్డ్) వంటి ప్రధాన అవార్డులు ఉన్నాయి. ఈ సినిమాను ప్రస్తుతం Amazon Prime Video లో చూడవచ్చు

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఊళ్ళో కొందరు కుర్రాళ్ళు సరదా కోసం ఒక వింతైన సిమెంటు చేయిని పట్టుకుని దెయ్యాలను పిలవడం మొదలుపెడతారు. ఆ చేయిని పట్టుకుని నా లోపలికి రా అని పిలిస్తే చాలు, ఏదో ఒక దెయ్యం వచ్చి వాళ్ళ ఒంట్లోకి దూరిపోతుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ దెయ్యం కేవలం 90 సెకన్లు మాత్రమే ఒంట్లో ఉండాలి. ఆ టైం దాటితే అది శాశ్వతంగా అక్కడే తిష్ట వేస్తుంది. ఈ కుర్రాళ్ళు ఆ పనంతా వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ గ్యాంగ్‌లో మియా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె తన తల్లి చనిపోయిన బాధలో ఉంటుంది. ఒకరోజు ఈ దెయ్యం ఆట ఆడుతున్నప్పుడు, తన తల్లి ఆత్మ వచ్చిందని నమ్మి మియా ఆ 90 సెకన్ల టైం లిమిట్‌ను పట్టించుకోదు. దీంతో ఆ దెయ్యాలు ఆమె చుట్టూ ఉన్నవాళ్ళని, పీక్కుతినడం మొదలుపెడతాయి. అక్కడితో ఆ సరదా ఆట కాస్తా నరకంలా మారిపోతుంది. ఏది నిజమో, ఏది దెయ్యం చూపిస్తున్న మాయో తెలియక మియా పిచ్చెక్కిపోతుంది.

Advertisement

చివరగా తన తమ్ముడిని కాపాడాలనే ఆరాటంలో మియా ఒక పెద్ద తప్పు చేస్తుంది. ఆ దెయ్యాల మాయలో పడి తన తమ్ముడిని చంపబోయి, తానే చనిపోతుంది. సీన్ కట్ చేస్తే, ఆమె చనిపోయిన తర్వాత తనూ ఒక ఆత్మలా మారిపోతుంది. సినిమా చివర్లో ఎవరో కొత్త కుర్రాళ్ళు ఆ చేయి పట్టుకుని ఆత్మను పిలిస్తే, ఇప్పుడు మియా ఆత్మ వాళ్ళ ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఆమె కూడా ఆ చేయి వెనుక ఉన్న ఆత్మల ప్రపంచంలో బందీ అయిపోయిందన్నమాట.

Read Also : దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×