E-Paper
Advertisement

చీకటి గదిలో శవం… గుండెల్లో గుబులు పుట్టించే భయం… ఫ్యూజులు అవుటయ్యే స్టోరీ

చీకటి గదిలో శవం… గుండెల్లో గుబులు పుట్టించే భయం… ఫ్యూజులు అవుటయ్యే స్టోరీ
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలలో ఎక్కువగా హాలీవుడ్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. కంటెంట్ నచ్చితే చాలు భాషను కూడా పక్కన పెట్టేస్తుంటారు. రీసెంట్ గా ఒక భిన్నమైన ఎమోషనల్ క్రైమ్ డ్రామా ఓటీటీలోకి వచ్చింది. దాదాపు 100 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను చూస్తుంటే అస్సలు చూపు తిప్పుకోలేం. ఈ కథ అతిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల తల్లి మరణించడంతో, ఆమె పిల్లలు మృతదేహాన్ని దాచిపెడతారు. ఈ నేపథ్యంలో స్టోరీ ఉత్కంఠభరితంగా మారుతుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాట్ వి హైడ్’ (What We hide). దీనికి డాన్ కే దర్శకత్వం వహించారు. దీని షూటింగ్ మొత్తం అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో జరిగింది. ఇందులో నటించిన మెక్కెన్నా గ్రేస్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా, ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం విశేషం. దర్శకుడు డాన్ కే ఈ కథను చాలా రియలిస్టిక్ గా, చిన్న పిల్లల భయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. విమర్శకుల నుండి ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి, ముఖ్యంగా పిల్లల నటన అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఇక స్ట్రీమింగ్ విషయానికొస్తే, ఇది ఆగస్టు 2025లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ రిలీజ్ అయ్యింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఇంట్లో స్పైడర్, జెస్సీ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వాళ్ల అమ్మకి డ్రగ్స్ అలవాటు ఉండి, ఒకరోజు డోస్ ఎక్కువై ఇంట్లోనే చనిపోతుంది. అమ్మ చనిపోయిందని తెలిస్తే పోలీసులు వచ్చి వాళ్లను తీసుకెళ్లి వేర్వేరు అనాథ శరణాలయాల్లో పడేస్తారని ఆ పిల్లలు భయపడతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, ఎవరికీ తెలియకుండా అమ్మ శవం ఉన్న గదికి తాళం వేసి, అసలు ఏమీ జరగనట్టే బయట తిరుగుతుంటారు. శవం ఇంట్లో ఉండగానే స్కూలుకు వెళ్లడం, ఇరుగుపొరుగు వాళ్లకి అనుమానం రాకుండా మేనేజ్ చేయడం వీళ్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే ఆ ఊరి పోలీస్ ఆఫీసర్‌కి ఎందుకో వీళ్ల మీద కొంచెం అనుమానం వస్తుంది.

మరోపక్క వీళ్ల అమ్మకి డ్రగ్స్ అమ్మేటోడు తన డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఆ శవాన్ని ఎక్కడ పడేయాలో, ఈ గొడవ నుండి ఎలా బయటపడాలో తెలియక ఆ చిన్న పిల్లలు పడే పాట్లు నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. అమ్మ శవం కుళ్లిపోతుంటే వాసన బయటకి రాకుండా అగరుబత్తులు వెలిగించడం, రూమ్ స్ప్రేలు కొట్టడం లాంటివి చేస్తూ కాలం గడుపుతారు ఈ పిల్లలు. కానీ ఆ డ్రగ్ డీలర్ ఇంట్లోకి జొరబడి పిల్లల్ని బెదిరించడం మొదలుపెడతాడు. చివరకు ఆ పోలీస్ ఆఫీసర్ కి నిజం తెలిసిందా? ఆ దుర్మార్గుడి నుండి పిల్లలు ఎలా తప్పించుకున్నారు? విడిపోకుండా కలిసి ఉండాలన్న వాళ్ల ఆశ నెరవేరిందా ?అన్నదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : అందమైన మాటలు.. అంతలోనే ఘోరమైన మోసాలు… అసలైన ‘ఫేక్’ లవ్ స్టోరీ

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×