E-Paper
Advertisement

OTT Movie : మంత్రగత్తె వల్ల ముప్పు… చేతబడితో భయపెట్టే సిరీస్… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

OTT Movie : మంత్రగత్తె వల్ల ముప్పు… చేతబడితో భయపెట్టే సిరీస్… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్
Advertisement

OTT Movie : భారతదేశంలో వచ్చిన తొలి పూర్తి స్థాయి సూపర్‌ నాచురల్ వెబ్ సిరీస్ ‘దాయన్’. ఒక సుదీర్ఘమైన ఈ సిరీస్ ఆడియన్స్ కి ఓ మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది. యాభైకి పైగా ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో మౌనీ రాయ్ 400 ఏళ్ల నుంచి జీవించి ఉన్న భయంకరమైన “దాయన్”గా కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టింది. రూపం మార్చుకునే శక్తి, తంత్ర, మంత్రాలు, రివెంజ్ డ్రామా, ఇవన్నీ కలిపిన ఒక లాంగ్ హారర్ సాగా ఇది. మౌనీ రాయ్ దాయన్ రూపం ఇప్పటికీ హారర్ ఫ్యాన్స్‌కి గుండెల్లో గుబులు పుట్టిస్తుంటుంది. ధైర్యం ఉన్న వాళ్ళు ఒక్క రాత్రి ఒక్కరే చూడండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీ ఏమిటంటే

‘దాయన్’ (2018–2019) సూపర్‌ నాచురల్ హారర్ వెబ్ సిరీస్. ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మాణంలో ZEE5లో రిలీజ్ అయిన ఈ 50+ ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఇందులో మౌనీ రాయ్ (దాయన్), టీనా దత్తా, మోహిత్ మల్హోత్రా, ప్రియాంశు, అనుష్కా సేన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో ఇది 6.8/10 రేటింగ్ తో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జాన్వీ, ఆకాశ్ అనే జంట హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. ఒక రోజు హర్షితా చోప్రా అనే అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. మొదట్లో ఫ్రెండ్లీగా కనిపించిన హర్షితా నిజానికి 400 ఏళ్ల క్రితం మరణించి మళ్లీ పుట్టిన ఒక శక్తివంతమైన దాయన్ అని తెలుస్తుంది. ఆమెకు జాన్వీ కుటుంబంతో పాత పగ ఉంటుంది. ఆ పగ తీర్చుకోవడానికి ఆకాశ్‌ను తన అందంతో మోహించి,పెళ్లి చేసుకుని ఇంట్లోకి వస్తుంది. రాత్రిపూట ఎర్రటి కళ్లు, లాంగ్ నెయిల్స్‌తో దాయన్ రూపం ధరించి ఒక్కొక్కరినీ చంపడం మొదలుపెడుతుంది.

Read Also : కలల దేవుడికి కబురు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం అక్కాతమ్ముళ్ల అడ్వెంచర్… కొత్త యానిమేషన్ ఫాంటసీ మూవీ

జాన్వీ తన భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తాంత్రిక్ సాయంతో దాయన్‌తో పోరాడుతుంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు వస్తాయి. ఆమె గత జన్మ కథ, జాన్వీ కుటుంబంతో ఉన్న సంబంధం, మనుషుల రూపాలు మార్చుకోవడం, ఇవన్నీ ఎపిసోడ్‌ ఎపిసోడ్ కు భయాన్ని పెంచుతాయి. ఆఖరి 10 ఎపిసోడ్లలో షాకింగ్ రివీల్స్‌తో సిరీస్ ఒక గ్రాండ్ క్లైమాక్స్‌కి చేరుకుంటుంది. ఆ క్లైమాక్స్ ఏంటి ? హర్షితా తన పగను పూర్తి చేసుకుంటుందా ? ఆమె గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×