E-Paper
Advertisement

Hyper Aadi : హనుమంతుడిపై అలిగారు.. అవమానించలేదు.. జక్కన్నకు హైపర్ ఆది సపొర్ట్..

Hyper Aadi : హనుమంతుడిపై అలిగారు.. అవమానించలేదు.. జక్కన్నకు హైపర్ ఆది సపొర్ట్..
Advertisement

Hyper Aadi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆది అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆది ఆయన పై ఎవరైన ఒక్క మాట అంటే ఊరుకోడు. అంతేకాదు సినీ హీరోల పై, ఇండస్ట్రీ పై వినిపిస్తున్న ట్రోల్స్ పై కూడా సీరియస్ అవుతుంటాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైపర్ ఆది రాజమౌళి హనుమంతుడి పై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆది ఏమన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రాజమౌళి వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నా వారణాసి మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ నిర్వహించి టైటిల్ను అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నాకు హనుమంతుడు అంటే కోపం అని అనడంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అంతేకాదు హిందూ సంఘాలు రాజమౌళి వ్యాఖ్యలపై మండిపడుతూ ఆయనపై ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు హైపర్ ఆది స్పందించారు.

Advertisement

ఆయన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. రాజమౌళి హనుమంతుడి పై వ్యాఖ్యలు చెయ్యలేదు. అవమానించలేదు.. ఆరోజు ఈవెంట్ లో గ్లింప్స్ వీడియో రిలీజ్ అవ్వడం ఆలస్యం అవ్వడంతో సీరియస్ అయ్యాడు.. రామాయణం, మహాభారతం అంటే ఇష్టం అన్న ఆయన అలాంటి మాటలు అంటాడా? ఏదో పొరపాటున దొర్లిన మాట అంతే.. దీన్ని ట్రోల్స్ చెయ్యడం మంచిది కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తీసుకొని వెళ్లాడు..ఇది గుర్తు పెట్టుకోండి.. హీరోల పై చిన్న విషయాలకు ట్రోల్స్ చెయ్యడంతో హీరోయిజం కామెడీగా మారింది. సినిమాలు భారీ కథతో వచ్చినా ప్లాప్ అవుతున్నాయని హైపర్ ఆది. ఇలాంటివి మానుకుంటే తెలుగు సినిమాలు హిట్ అవుతాయని హైపర్ ఆది అన్నారు. అదే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Also Read: భాగ్యం ఎక్కడా తగ్గదు.. పంతంతోనే పెళ్లి.. అన్నీ ట్విస్ట్ లే..

వారణాసి మూవీ అప్డేట్.. 

Advertisement

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న మూవీ కోసం యావత్ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. హనుమంతుడి పాత్రలో కిచ్చా సుదీప్ నటిస్తున్నారు. హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. 2027 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు.

 

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×