OTT Movie : ఒక చైనీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. లవ్ అండ్ రివేంజ్ థీమ్స్ తో రూపొందిన ఈ సిరీస్ ను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇది ఒక అమ్మాయిని ప్రేమికుడు మోసం చేసిన తర్వాత, కొత్త ప్రేమికుడితో అతనిపై ప్రతీకారం తీర్చుకునే డిఫరెంట్ కథ. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘లవ్ స్ట్రైక్స్ బ్యాక్’ (Love strikes back) 2023లో వచ్చిన చైనీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్. గువో యానాన్ దర్శకత్వంలో యాంగ్ షువే’ర్, గువో జియానాన్, డెన్నీ డెంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 22 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2023 సెప్టెంబర్ 15 న యౌకూ ఓటీటీలో విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. IMDbలో ఇది 8.0/10 రేటింగ్ ని కూడా పొందింది.
యాన్ ఒక రిచ్ అమ్మాయి, జున్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వీళ్ళు తొందరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఆమెకు ఒక షాకింగ్ సీక్రెట్ తెలుస్తుంది. జున్, యాన్ బెస్ట్ ఫ్రెండ్ లీ తో రిలేషన్‌లో ఉంటాడు. ఈ మోసం తెలిసి యాన్ షాక్ అవుతుంది. దీంతో ఆమె తట్టుకోలేని బాధతో ఒక బిల్డింగ్ నుంచి పడిపోయి కోమాలోకి వెళ్తుంది. మూడు సంవత్సరాల తర్వాత యాన్ మెలుకువలోకి వస్తుంది. ఇంతలో ఆమె కంపెనీని జున్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కోపంతో రగిలిపోయిన యాన్ తన కంపెనీని తిరిగి పొందాలని, మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన తండ్రి బాడీగార్డ్ షియో ను కలుస్తుంది. షియో ఎప్పటి నుంచో యాన్‌ను సీక్రెట్‌గా ఇష్టపడుతుంటాడు.
Read Also : అందమైన అమ్మాయిలు కదాని సొల్లు కారిస్తే నరకమే… రక్తదాహంతో ఉన్న పిశాచులు… గుండె జారిపోయే సీన్స్