E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం స్కూల్‌కు వెళ్లకుండా ఉండిపోయిన అంజు

Nindu Noorella Saavasam Serial Today November 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం స్కూల్‌కు వెళ్లకుండా ఉండిపోయిన అంజు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అమ్ము, ఆకాష్‌, ఆనంద్‌ స్కూల్‌కు రెడీ అవుతుంటే.. అంజు మాత్రం రెడీ కాకుండా అలాగే ఉంటుంది. పైగా బెడ్‌ మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. దీంతో ఆనంద్‌ ఏంటి అంజు స్కూల్‌కు టైం అవుతుంటే రెడీ కాకుండా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దీంతో అంజు నేను ఈ రోజు స్కూల్ కు రావడం లేదు అన్నయ్య అని చెప్తుంది. దీంతో ఆకాష్‌ ఏ ఎందుకు రావు అని అడుగుతాడు. రావాలనిపించడం లేదని అంజు చెప్తుంది. ఏ ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని అమ్ము అడుగుతుంది. ఇంతలో మనోహరి డోర్‌ దగ్గరకు వచ్చి చూస్తుంది. అంజు ఈ రోజు అంతా మిస్సమ్మకు తోడుగా ఉంటాను అని చెప్తుంది.

దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇదేంటి మిస్సమ్మకు తోడుగా  ఇంట్లోనే ఉంటానంటుంది అని భయపడుతుంది. ఇంతలో ఆనంద్‌ కోపంగా మిస్సమ్మకు తోడుగా కేర్‌ టేకర్‌ యాదమ్మ ఉంది కదా అంజు.. అంటాడు. మనోహరి ఆంటీ కూడా ఇంట్లోనే ఉంటుంది కదా..? మళ్లీ మిస్సమ్మకు నీ తోడు ఎందుకు అని ఆకాష్‌ అడుగుతాడు. ఎందుకో తెలియదు ఈ రోజు మిస్సమ్మను వదిలి ఎక్కడికి రావాలనిపించడం లేదు అని అంజు చెప్తుంది. దీంతో మనోహరి షాకింగ్‌ గా ఎవరో చెప్పినట్టు ఇది ఇంట్లోనే ఉంటానంటుంది ఏంటి..? ఆరు పైకి వెళ్లిందా..? లేక దీని ఒంట్లో ఏమైనా దూరిందా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమ్ము కోపంగా మరి స్కూల్‌ లో మిస్‌ అడిగితే ఏం చెప్పాలి అంటుంది. నాకు ఒంట్లో బాగా లేదు అందుకే స్కూల్‌కు రాలేదు అని చెప్పండి అంటూ అంజు చెప్పగానే.. ఆకాష్‌ కోపంగా మాకు నీలా అబద్దం చెప్పడం రాదే.. అంటాడు. మాకు నీలా ఉన్నవి లేనట్టు చెప్పడం రాదు అంటుంది అమ్ము..

Advertisement

దీంతో అంజు కోపంగా అలా చెప్పకపోతే నేను స్కూల్‌ మానేశానని చెప్పండి. నాకు టీసీ ఇస్తా అంటే ఇవ్వమని చెప్పండి.. అంతే కానీ నేను రానని చెప్పండి.. అంటూ అరుస్తుంది. మనోహరి మాత్రం ఏమైంది దీనికి ఎందుకు ఇంత కరాకండిగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆనంద్‌ బాధగా ఏమైంది అంజు ఎందుకు రానంటున్నావు అని అడగ్గానే.. ఏమో తెలియదు అన్నయ్య ఉదయం నుంచి అమ్మే గుర్తుకు వస్తుంది ఈ రోజంతా మిస్సమ్మ పక్కనే ఉండాలనిపిస్తుంది ఫ్లీజ్‌ మీరు కూడా నాతో పాటు మిస్సమ్మకు తోడుగా ఉండండి అని చెప్పగానే.. మీ అందరూ ఇంట్లో  ఎందుకే భాగీతో పాటు మీరు కూడా పైకి పోవడానికా..? అని మనోహరి మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆనంద్‌ సారీ అంజు నాకు ఈ రోజు ఇంపార్టెంట్‌ క్లాసులు ఉన్నాయి. వెళ్లి తీరాలి అని చెప్తాడు.. అమ్ము కూడా నాకు ఎగ్జామ్‌ ఉంది అంజు నేను కూడా వెళ్లాలి.. అని చెప్పగానే.. నాకు ఇంపార్టెంట్‌ క్లాస్‌ ఉంది అంజు అని ఆకాష్‌ చెప్తాడు. సరే నేను మీ మిస్‌ ఏదో ఒకటి చెప్తానులే అంజు నువ్వు ఇంట్లోనే ఉండు మేము స్కూల్‌కు వెళ్లి వస్తాము.. అని చెప్పగానే.. సరే బై అని చెప్తుంది అంజు.

పిల్లలు రూంలోంచి బయటకు వస్తుంటే.. మనోహరి చాటుకు వెళ్లిపోతుంది. పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోతారు. ఎవరో చెప్పినట్టు ఈ అంజు స్కూల్‌కు వెల్లకుండా ఆగిపోయింది. ఈ రోజు భాగీ దాని కడుపులో బిడ్డతో పాటు ఆరు కడుపును పుట్టిన బిడ్డ కూడా చావాలని రాసిపెట్టి ఉందేమో..? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

Big Stories

Advertisement
×