BigTV English

OTT Movie : స్పేస్ క్రాఫ్ట్ పేలుడు… దాని ఒక్కో ముక్కతో భూమిపై ఒక్కో వినాశనం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : స్పేస్ క్రాఫ్ట్ పేలుడు… దాని ఒక్కో ముక్కతో భూమిపై ఒక్కో వినాశనం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నప్పుడు, మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలలో వచ్చే విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక స్పేస్ నౌక నుంచి వచ్చే శఖలాలు భూమిపై అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఈ సిరీస్ లో ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘డెబ్రిస్’ (Debris). ఈ సిరీస్ NBCలో 2021మార్చి 1 నుంచి ప్రీమియర్ అయింది. J.H. వైమన్ దీనిని సృష్టించారు. యూనివర్సల్ టెలివిజన్, లెజెండరీ టెలివిజన్ దీనిని నిర్మించాయి. ఈ సిరీస్‌లో జోనాథన్ టక్కర్ (బ్రయాన్ బెనెవెంటి), రియాన్ స్టీల్ (ఫినోలా జోన్స్), నార్బర్ట్ లియో బట్జ్ (క్రెయిగ్ మాడాక్స్), స్క్రూబియస్ పిప్ (ఆన్సన్ ఆష్) ప్రధాన పాత్రలలో నటించారు. ఇది ఒక గ్రిప్పింగ్ సై-ఫై థ్రిల్లర్, ఇది గతంలో వచ్చిన ‘ది X-ఫైల్స్’, ‘ఫ్రింజ్’ వంటి సిరీస్‌లతో పోల్చబడింది. IMDB లో ఈ సిరీస్ కి ఈ సిరీస్ కి 7.7/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

గత ఆరు నెలలుగా ఒక స్పేస్ నౌక శకలాలు, భూమిపై చాలా ప్రాంతాలలో పడుతుంటాయి. ఈ శకలాలు సాధారణ మానవులపై పడుతూ, వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తుంటాయి. ఈ శకలాలు వింత శక్తులు కలిగి ఉన్నాయి. ఇవి ఎవరైనా టెలిపోర్ట్ చేయగలవు, క్లోన్ అవ్వగలవు. ఈ శిథిలాలను సేకరించడానికి, వాటి రహస్యాలను వెలికితీసేందుకు ఒక అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ టీం ను నియమిస్తారు. ఈ టీం లో బ్రయాన్ బెనెవెంటి అనే  CIA ఏజెంట్, ఫినోలా జోన్స్ MI6 తో కలసి పని చేస్తాడు. వీళ్లిద్దరూ భిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ, ఈ మిషన్ ల్ కలిసి పనిచేస్తారు. బ్రయాన్, ఫినోలా కలిసి ఈ శిథిలాలను వెతుకుతూ, వాటి వల్ల జరిగే వింత సంఘటనలను పరిష్కరిస్తారు. చివరికి వీళ్ళ పరిశోధనలో ఎలాంటి రహస్యాలు తెలుస్తాయి ? ఆ శకలాలు ఎక్కడి నుంచి పడుతుంటాయి ? గ్రహాంతర వాసులతో సంబంధం ఉంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : రెండున్నర నెలల తరువాత ఓటీటీలోకి రవితేజ మేనల్లుడి సినిమా… ఐఎండీబీలో 9.5 రేటింగ్ ఉన్న తెలుగు లవ్ స్టోరీ

Related News

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

Big Stories

×