Teja Sajja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోగా మారిపోయాడు తేజ సజ్జ. దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా యాక్టింగ్ చేశాడు. చాలామందికి నచ్చిన హీరో కూడా. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ లో తేజ మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు.
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమాతో మంచి పేరును సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో చేతులు కలుపుతూ వరుసగా సినిమాలు చేశాడు. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో స్టేజ్ పై కూడా మాట్లాడుతూ… రవితేజకు పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కు సుకుమార్, నాకు ప్రశాంత్ వర్మ అంటూ తన ప్రేమను తెలియజేశాడు. హనుమాన్ సినిమాతో ఏకంగా స్టార్ హీరోస్ పోటీ ఇచ్చాడు.
ఆ దర్శకుడు తో సినిమా చేయొద్దు
కొన్ని సినిమాలు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. అలానే బ్లాక్బస్టర్ సినిమా కూడా కొన్ని సందర్భాల్లో అందరికీ నచ్చదు. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఆ సినిమాను నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఒక సందర్భంలో తెలుగులో ప్రముఖ హీరో కూడా ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో నాకే అర్థం కాలేదు అంటూ తెలిపాడు.
నెటిజెన్స్ ఫైర్
ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా ఇదివరకే ఎఫ్ 3 సినిమా కూడా వచ్చేసింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఎఫ్ 4 సినిమా కూడా వస్తుందని అనౌన్స్ చేశారు. తేజ సజ్జ, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి హైదరాబాద్ ఏఎంబి థియేటర్లో ఒక సినిమా కోసం వెళ్లారు. అయితే వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్లు షేర్ చేశాడు తేజ. ఎఫ్ వన్ సీట్ లో కూర్చుని, ఎఫ్ 4 సినిమా గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక్కడితో నెటిజన్స్ అంతా కూడా నువ్వు అటువంటి క్రింది సినిమాలు చేయకు అంటూ కామెంట్స్ లో మండిపడుతున్నారు. హనుమాన్ సినిమా పది పార్ట్ లు తీసిన కూడా మేము చూస్తాం అంటున్నారు.
Also Read: U.V Creations: మొన్న విశ్వంభర.. నేడు ఘాటీ వాయిదా… అసలేం జరుగుతుంది?
క్రేజీ రేస్ లో సక్సెస్
ఇక తేజ సజ్జ విషయానికి వస్తే హనుమాన్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అదే సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా కు అద్భుతమైన పోటీ ఇచ్చాడు. హనుమాన్ సినిమాకి మొదట ఆశించిన విధంగా థియేటర్లు దొరకలేదు. ఆ తరువాత సినిమాకు మంచి హిట్ టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్స్ను ఆడియన్స్ అందించారు. ఈ సినిమాను పిల్లలు విపరీతంగా ఇష్టపడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు చాలామంది ఆడియన్స్.
We are at the F1
Discussing about F4 😉😀 pic.twitter.com/bAmXKGtr2k— Teja Sajja (@tejasajja123) July 5, 2025