Ravi Kishan: రవీంద్ర కిషన్ శుక్లా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ రవికిషన్ అంటే మాత్రం ఈయనని అందరు గుర్తుపడతారు. ఇకపోతే రేసుగుర్రం(Racegurram) విలన్ అంటే మాత్రం అందరికీ మద్దాల శివారెడ్డిగా అందరికీ టక్కన గుర్తుకొస్తారు. ఈయన నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినప్పటికీ రేసుగుర్రం సినిమాలో విలన్ పాత్రలో మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బోజ్ పురి నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇక సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంపీగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకున్న రవి కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.
వింత అలవాట్లు..
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటేనే ఎన్నో విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందంగా కనిపిస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో మాత్రం సెలబ్రిటీలు వెనకడుగు వేయరు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రవికిషన్ తనకు ఉన్నటువంటి అలవాట్లు గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నటుడిగా కొనసాగాలి అంటే పాలతో స్నానం(Milk Bath) చేయాలని గులాబీ రేకులపై నిద్రపోవాలని భ్రమలో తాను ఉండే వాడినని ఈయన అసలు విషయం చెప్పారు.
అలవాట్లతో సినిమా ఛాన్స్ మిస్..
తనకు ఇలాంటి అలవాట్లు ఉండడంతో ఈ విషయాన్ని ఎవరు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తో తెలియజేశారు. ఇక ఈ విషయం ఆయనకు తెలియడంతో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అనే సినిమాలో తాను అవకాశాన్ని కోల్పోయినట్టు ఈ సందర్భంగా రవికిషన్ వెల్లడించారు. అనురాగ్ తో కలిసి “గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్” సినిమా అవకాశాన్ని కోల్పోయిన తిరిగి ఆయనతో కలిసి “ముక్కాబాజ్” అనే సినిమాలో నటించినట్టు ఈయన తెలియజేశారు. తాజాగా రవి కిషన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మద్దాలి శివారెడ్డిగా గుర్తింపు..
ఇలా పాలతో స్నానం, పడుకోవడానికి గులాబీ రేకులువాడే అలవాటు ఉందని చెప్పడంతో ఈయన రేంజ్ మామూలుగా లేదు అంటూ నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల రవి కిషన్ సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఈయన ఎంపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. రేసుగుర్రం సినిమాలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడమే తన లక్ష్యమని చెప్పిన రవికిషన్ నిజజీవితంలో కూడా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఇక ఈయన ఎక్కువగా భోజ్ పురి, హిందీ సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. రేసుగుర్రం సినిమా ద్వారా విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవి కిషన్ అనంతరం కిక్ 2 , సుప్రీమ్, ఒక అమ్మాయి తప్పా, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి వంటి తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Also Read: Roja On RP: జబర్దస్త్ లో ఆ ఒక్కడికే విశ్వాసం లేదు.. రోజా కామెంట్స్ అతని గురించేనా?