OTT Movie : మాస్ మహారాజ్ రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ నటించిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అవినాష్ వర్మ తొలిసారిగా ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఒక లవ్ స్టోరీకి, థ్రిల్లర్ ఎలిమెంట్ ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
సన్ ఎన్‌ఎక్స్‌టీ (Sun NXT) లో
ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘జగమెరిగిన సత్యం’ (Jagamerigina satyam). 2025 లో విడుదలైన ఈ తెలుగు సినిమాకి తిరుపతి పాలె దర్శకత్వం వహించారు. అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ కింద అచ్చ విజయ భాస్కర్ దీనిని నిర్మించారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ తన తొలి చిత్రంతో పరిచయమవుతున్నాడు. ఆద్య రెడ్డి, నీలిమ పఠకంశెట్టి, వాసుదేవ రావు ప్రధాన పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా, షోయబ్ సినిమాటోగ్రఫీ, అమర్ రెడ్డి కుదుముల ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. 2025 జూలై 4 నుంచి సన్ ఎన్‌ఎక్స్‌టీ (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1994లో తెలంగాణ సరిహద్దులోని దిమ్డా అనే గ్రామంలో జరుగుతుంది. కథ సత్యం (అవినాష్ వర్మ) అనే రైతు కొడుకు చుట్టూ తిరుగుతుంది. సత్యం గ్రామ సర్పంచ్ మేనకోడలు సరిత (ఆద్య రెడ్డి)తో ప్రేమలో పడతాడు. వీళ్ళ ప్రేమకథ చూడ ముచ్చటగా ప్రారంభమవుతుంది. అయితే సత్యం, సరితను ప్రేమించడాన్ని కొంతమంది ఓర్వలేకపోతారు. ఈ అసూయ గ్రామ రాజకీయాల వైపు వెళ్తుంది. సరిత కుటుంబం, గ్రామంలో ఒక హోదా కలిగిన సర్పంచ్ కుటుంబం. సత్యం సామాజిక స్థితి వాళ్ళ ప్రేమకథకు అడ్డంకిగా మారుతుంది. ఈ క్రమంలో సత్యంకు ఒక షాకింగ్ ట్విస్ట్ ఎదురుపడుతుంది. ఆ గ్రామంలో ఒక హత్య జరుగుతుంది. ఇది గ్రామంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. సత్యం ఈ హత్యకు సంబంధించి తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటాడు. ఇది అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది.
ఈ హత్య, ద్రోహం గ్రామ రాజకీయాలు, వ్యక్తిగత పగలతో ముడిపడి ఉంటాయి. ఇవి కథకు థ్రిల్లర్ ఎలిమెంట్‌ను జోడిస్తాయి. ఇక సత్యం తన పై వచ్చిన ఈ నిందను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను కుటుంబం, సరిత, గ్రామస్తుల నుండి అనుకోని సమస్యలను ఎదుర్కుంటాడు. అయినా కూడా అతను తన గౌరవాన్ని, ప్రేమను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ స్టోరీ ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. చివరికి ఈ గ్రామంలో హత్య ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ? సత్యం తనపై జరిగే కుట్రలను ఎలా ఎదుర్కుంటాడు ? సత్యం లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒక్కడితోనే పని కానిచ్చే వదినా మరదళ్ళు… పెళ్లయ్యాక పాడు పనులు… మతి పోగొట్టే క్లైమాక్స్ ట్విస్టు