BigTV English
Advertisement

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : హాలివుడ్ హారర్ థ్రిల్లర్ సినిమాలను మనవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. మేకర్స్ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు సరికొత్త కథలను స్ట్రీమింగ్ కి తెస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇందులో కొంత మంది కల్ట్ మెంబర్స్ మహిళల గర్భాల నుంచి దుష్ట శక్తులు ఉన్న పిల్లల్ని పుట్టిస్తుంటారు. క్లైమాక్స్ వరకూ సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇచ్చే ఈ సిరీస్, ఓటీటీలో ట్రెండింగ్ లో కూడా ఉంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


హులులో స్ట్రీమింగ్

‘అమెరికన్ హారర్ స్టోరీ: డెలికేట్’ (American Horror Story: Delicate) అనేది 2023-2024లో హులు (Hulu)లో విడుదలైన, అమెరికన్ హారర్ ఆంథాలజీ సిరీస్‌లో 12వ సీజన్. రయన్ మర్ఫీ, బ్రాడ్ ఫాల్చక్ దీనిని రూపొందించారు. ఇది డానియెల్ వాలెంటైన్ నవల ‘డెలికేట్ కండిషన్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సీరీస్ 9 ఎపిసోడ్‌లతో టాప్ స్ట్రీమ్డ్ హారర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఐయండిబిలో 6.9/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

అన్నా ఒక హాలివుడ్ యాక్ట్రెస్. ఆమె భర్త డెక్స్ ఒక సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్. ఇద్దరూ బేబీ కావాలని ట్రై చేస్తుంటారు. చాలా ప్రయత్నాల తరువాత చివరికి అన్నా ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఆమెకు విచిత్రమైన హాలుసినేషన్స్, దెయ్యాలు కనిపిస్తాయి. ఒక స్పైడర్ ఆమె గర్భంలోకి వెళ్ళినట్లు డ్రీమ్ వస్తుంది. ఆమె మొదట ఇదంతా స్ట్రెస్” అని అనుకుంటుంది. అన్నా డాక్టర్ హిల్ వద్ద చెకప్ చేయిస్తుంది. అతను బేబీ హెల్తీ గా ఉందని చెప్పినా, అన్నాకు అనుమానం వస్తుంది. ఆమె స్నేహితురాలు ఇవా కూడా రహస్యంగా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నా గర్భం పెరిగే కొద్దీ భయాలు కూడా పెరుగుతాయి. ఆమె బాడీలో మార్పులు, రక్తం కారడం, బేబీ మూవ్‌మెంట్స్ అసహజంగా ఉంటాయి. డెక్స్ ఆమెకి మానసిక సమస్య ఉందని అనుకుంటాడు.


Read Also : పెళ్ళాం గదిలోకి దగ్గరుండి మరో మగాడిని పంపే భర్త… సింగిల్ గా చూడాల్సిన అరాచకం మావా

అన్నా ఆసుపత్రిలో ఉండగా, డాక్టర్ హిల్ తో సహా ఆమె వెంట ఉన్న అందరూ ఒక పురాతన కల్ట్ మెంబర్స్ అని తెలుస్తుంది. ఈ కల్ట్ మహిళల గర్భాలను ఉపయోగించి సూపర్‌ నాచురల్ బేబీలను సృష్టిస్తుంది. డెక్స్ కూడా ఇందులో భాగమని రివీల్ అవుతుంది. అన్నా బేబీని రక్షించడానికి పోరాడుతుంది. కానీ కల్ట్ ఆమెను హంట్ చేస్తుంది. చివరి ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్ వస్తుంది. బేబీ పుట్టిన తర్వాత అది ఒక డెమోనిక్ బేబీ అని కన్ఫర్మ్ అవుతుంది. అన్నా దాన్ని చంపాలా లేదా రక్షించాలా అని డైలమాలో పడుతుంది. చివరికి అన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? కల్ట్ ఆమె బిడ్డను తెసుకెళ్తుందా ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తలుసుకోండి.

 

Related News

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్

OTT Movie : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..

OTT Movie : బ్రూటల్ మర్డర్స్… అమ్మాయిల బట్టల వాసన చూస్తూ ఆ పాడు పని చేసే సైకో… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు

OTT Movie : భార్య కళ్ళముందే విదేశీ అమ్మాయితో… అన్నీ అవే సీన్లు… కల్లోనూ కలవరింతలు పుట్టించే కథ

OTT Movie : శుద్ధీకరణ పేరుతో సిగ్గులేని పని… భర్తను చంపేసి ఆశ్రమంలో అరాచకం… పెద్దలకు మాత్రమే

Big Stories

×