 
					OTT Movie : ఈ రోజుల్లో టెక్నాలజీ ఆధారంగా కేసులు చాలా వరకు సాల్వ్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు కేసులు చాలా కష్టంగానే ఉండేవి. కొన్ని దేశాలలో కొన్ని కేసులు అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటలీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో, 1968 నుండి 1985 వరకు జరిగిన భయంకరమైన సీరియల్ కిల్లింగ్స్ గురించి చెప్పుకోవాల్సిందే. ఏకాంతంగా గడుపుతున్న జంటలను, దారుణంగా ఒక కిల్లర్ హత్యలు చేసేవాడు. 17 మందిని చంపిన ఆ కిల్లర్ మనుషులను ముక్కలుగా నరికేవాడు. ఇటలీలోని అత్యంత సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ అరుదైన కేసును వెబ్ సిరీస్ రూపంలో తీసుకొచ్చారు మేకర్స్. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్’ (The Monster of Florence) అనేది స్టెఫానో సోలిమా సృష్టించి దర్శకత్వం వహించిన ఇటాలియన్ క్రైమ్ డ్రామా లిమిటెడ్ సిరీస్. ఇది 2025 అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. నాలుగు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ఒక్కోటి ఒక్కో స్టైల్ లో వణుకు పుట్టిస్తుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇటలీలోని అత్యంత సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసు. ఐయండిబిలో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది.
Read Also : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్
ఇటలీలోని ఫ్లోరెన్స్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, యువకులు లవర్స్ తో టైమ్ స్పెండ్ చేయడానికి బయటకు వస్తుంటారు. ఈ జంటలు లేక్ ల మధ్య, ఎవరూ లేని చోట కార్లలోనే రొమాంటిక్ మూమెంట్స్ గడుపుతున్నప్పుడు, ఒక కిల్లర్ వాళ్ళని లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేస్తుంటాడు. దాదాపు 17 సంవత్సరాల్లో 8 జంట హత్యలు జరుగుతాయి. వాళ్ళందరిని ఒకే ఆయుధంతో కిల్లర్ చంపాడు. కిల్లర్ హత్యల తర్వాత శరీరాలను ముక్కలుగా నరికి భయాన్ని సృష్టించేవాడు. ఈ సీరీస్ 1982లో ఒక జంట హత్యతో మొదలవుతుంది. పోలీసులు ఈ కేసును 1968లో జరిగిన ఒక పాత హత్యతో లింక్ చేస్తారు. అది కూడా రాత్రి సమయంలో కారులోనే జరిగింది. ఈ పాత కేసులో బార్బరా అనే మహిళ ప్రియుడితో రొమాన్స్ చేస్తున్నప్పుడు కిల్లర్ వారిని కాల్చి చంపాడు. ఈ హత్యలో బార్బరా భర్త ప్రధాన సస్పెక్ట్ గా జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇది సీరీస్‌లో మిస్టరీగా ఉంటుంది. అయితే అతను జైలులో ఉండగా కూడా హత్యలు జరుగుతాయి. పోలీసులు కూడా కిల్లర్ ఎవరు ? హత్యలు ఎవరు చేశారు ? అనే సందేహాలతో తికమక పడతారు. చివరికి ఇది ఒక అన్ సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది.