 
					Govt Medical College: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎంఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలంగాణ స్టేట్ట్, హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబరు 5వ తేదీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 52
పోస్టులు – వెకెన్సీలు
 ప్రొఫెసర్ – 04 పోస్టులు
ప్రొఫెసర్ – 04 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ – 12 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 13 పోస్టులు
సీనియర్ రెసిడెంట్ – 23 పోస్టులు
వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎపిడెమియాలజిస్ట్, అనాటమీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, రేడియో-డయాగ్నోసిస్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్ అయి ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వయస్సు మించరాదు.
వేతనం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు ప్రొఫెసర్ కు రూ.1,90,000. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,25,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ.1,06,461 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, టీచింగ్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ డేట్: 2025 నవంబర్ 5
ఇంటర్వ్యూ అడ్రస్: ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, 2వ అంతస్తు, ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్, జనగామ..
ALSO READ: Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు వారిదే.. లోక్ పాల్ సంచలన సర్వే.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్