 
					Champion Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులలో శ్రీకాంత్ ఒకరు. నటుడుగా కొన్ని సినిమాలలో కనిపించి ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా శ్రీకాంత్ సినిమాలు ఎగబడి మరీ చూసేవాళ్ళు. తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు శ్రీకాంత్. ఒక తరుణంలో శ్రీకాంత్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా నటుడుగా కొన్ని సినిమాలను చేయటం మొదలుపెట్టాడు.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో రోషన్ ఒకడు. చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. కొంతమంది వారసత్వ నటులు కూడా ఉన్నారు వారిలో ఆకాష్ పూరి, రోషన్, రోషన్ కనకాల వంటి హీరోలు కూడా ఉన్నారు. నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పెళ్లి సందడి సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు.
రోషన్ హీరోగా శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఛాంపియన్ అనే సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంస్థలో కల్కి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఛాంపియన్ సినిమాను మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ సినిమా మొదటి షాట్ కి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు.
ఛాంపియన్ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ బేసిస్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే, డిస్ట్రిబ్యూటర్స్ నుండి NRA (Non-Refundable Advance) తీసుకోరు. ఎవరైనా సినిమా తీసుకోవాలంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి, రిఫండ్ ఆప్షన్ ఉండదు.
మరోవైపు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. రోషన్ కు ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు. మరి ఛాంపియన్ అనే సినిమా ఇండస్ట్రీలో రోషన్ ను ఛాంపియన్ గా నిలబెడుతుందా లేదా చూడాలి. చిత్ర యూనిట్ మాత్రం సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచుకుంది అని అర్థమవుతుంది.
Also Read: Rahul Ravindran : చిన్మయిని చెడగొట్టింది నేనేనేమో అనిపిస్తుంది