E-Paper
Advertisement

OTT Movie : ఒకే రాత్రి వరుస హత్యలు… పోలీసులను పరుగులు పెట్టించే కేసు… ఓటీటీలోకి తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒకే రాత్రి వరుస హత్యలు… పోలీసులను పరుగులు పెట్టించే కేసు… ఓటీటీలోకి తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ల పరంపర ఆగడంలేదు. ప్రతి భాషలోనూ ఈ జానర్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సిరీస్ లు మామూలుగా ఓ పది ఎపిసోడ్స్ తో తెరకెక్కుతుంటాయి. అయితే ఈ సారి ఏకంగా 50 ఎపిసోడ్లతో ఒక ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి థ్రిల్లర్ అభిమానులను తమిళం, తెలుగులో పలకరిస్తోంది. ఒకేసారి అన్ని ఎపిసోడ్లు రిలీజ్ చేయకుండా, ప్రతి వారం ఒక ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఒక రాత్రి జరిగే మూడు హత్యలతో ఈ సిరీస్ ఇంటెన్స్ గా సాగుతుంది. ఈ సుధీర్ఘమైన సిరీస్ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో క్రైమ్ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

జెశ్విని జే దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌’. ఇందులో అశ్విన్ కుమార్ లీడ్ రోల్ లో నటించగా, పదిని కుమార్, ప్రీతి శర్మ, శ్రీతు క్రిష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. 50 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో అశ్విన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారు. ఇది ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హైదరాబాద్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచడానికి , ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తారు.

Advertisement

Read Also : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే

స్టోరీ ఏమిటంటే

హైదరాబాద్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ లో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. స్టేషన్ హెడ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రిస్క్ తీసుకునే ఒక డైనమిక్ ఆఫీసర్. అతని ఫాదర్ కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. కానీ ఇంకా డిపార్ట్ మెంట్ కి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. మొదటి ఎపిసోడ్ లో మొదలయ్యే మూడు హత్యలతో సిరీస్ ఉత్కంఠతను పెంచుతుంది. వారానికి ఓ కొత్త కేసుతో ఇది మొదలవుతుంది. ఇవన్నీ ధూల్‌పేట్ ప్రాంతంలో జరిగే డ్రగ్స్, మర్డర్స్, కిడ్నాప్స్, పాలిటికల్ కాన్స్పిరసీలతో కనెక్టెడ్ గా ఉంటాయి. తండ్రి కొడుకులు కలసి ఈ కేసులతో పోరాడతారు. 50 ఎపిసోడ్లలో వీళ్ళు ఎలాంటి కేసులతో పోరాడుతారో ఈ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌’ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×