E-Paper
Advertisement

OTT Movie : టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ను ఓటీటీలో ఫ్రీగా ఎక్కడ చూడవచ్చో తెలుసా ?

OTT Movie : టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ను ఓటీటీలో ఫ్రీగా ఎక్కడ చూడవచ్చో తెలుసా ?
Advertisement

OTT Movie : టామ్ క్రూజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై అడ్వెంచర్ “మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్” ఇప్పుడు ఓటీటీలో ప్లాట్‌ ఫామ్‌ లో ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. 2025 మేలో థియేటర్లలో విడుదలైన తర్వాత, ప్రేక్షకులు ఈ చిత్రం డిజిటల్ వెర్షన్‌ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికే ఇది రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఫ్రీగానే చూసి ఆనందించవచ్చు. టామ్ క్రూజ్ “మిషన్: ఇంపాజిబుల్” ఫ్రాంచైజీలో ఇదే చివరి చిత్రం కావడంతో డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లో 8వ భాగం, చివరిది అయిన ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ (Mission: Impossible – The Final Reckoning) 2023లో వచ్చిన ‘డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ కి సీక్వెల్. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ డైరెక్షన్లో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించారు. అతనితో పాటు హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, పోమ్ క్లెమెంటిఫ్, ఎసై మోరల్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 23న థియేట్రికల్ రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 2025 డిసెంబర్ 4 నుంచి ఈ సినిమా Amazon Prime Video లో తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : 18 ఏళ్ల వయసులో ఉరి… బ్రిటిష్ వాళ్ళను వణికించిన చిచ్చరపిడుగు… ఓటీటీలోకి వచ్చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్

Advertisement

స్టోరీలోకి వెళ్తే

ప్రపంచంలోని అన్ని గ్లోబల్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లలోకి చొరబడి, అణ్వాయుధ వ్యవస్థలను నియంత్రిస్తున్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) “ది ఎంటిటీ” ను శాశ్వతంగా నాశనం చేయడమే ఈథన్ హంట్ (టామ్ క్రూజ్), అతని బృందం ప్రధాన లక్ష్యం. “ఎంటిటీ” ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టిస్తుంటుంది. ఈథన్ బృందం దీనిని కంట్రోల్ చేసే కోడ్ ఉన్న రష్యన్ జలాంతర్గామిని గుర్తించి, అందులో ఉన్న కీలకమైన పరికరాన్ని పొందాలి. ఈ పరికరాన్ని ఉపయోగించి “ఎంటిటీ”ని నాశనం చేయవచ్చు. ఈ మిషన్‌లో ఈథన్‌కు గాబ్రియెల్ అనే పాత శత్రువు అడ్డంకిగా నిలుస్తాడు. ఈథన్ తన బృందంతో కలసి ఎన్నో స్టంట్‌లు, ఉత్కంఠభరితమైన మలుపులతో ఆ పరికరాన్ని రికవరీ చేస్తాడు. చివరికి ‘ఎంటిటీ’ని నాశనం చేసి, ఈ ప్రపంచాన్ని రక్షించడంలో ఈథన్ విజయం సాధిస్తాడు. ఈ చిత్రం 30 ఏళ్ల ‘మిషన్ ఇంపాసిబుల్’ ఫ్రాంఛైజీకి సంతృప్తికరమైన ముగింపును అందిస్తుంది.

Advertisement

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×