E-Paper
Advertisement

Teenmar Mallanna: ఈశ్వరచారిది ఆత్మబలిదానమా..? లేదా ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆత్మహత్యనా..? అసలు నిజాలివే..

Teenmar Mallanna: ఈశ్వరచారిది ఆత్మబలిదానమా..? లేదా ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆత్మహత్యనా..? అసలు నిజాలివే..
Advertisement

Teenmar Mallanna: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ చర్చకు మెయిన్ పిల్లర్.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరచారి అనే వ్యక్తి.. ఈశ్వరచారి బలిదానం బీసీ రిజర్వేషన్ల కోసమే జరిగిందని మల్లన్న చెబుతున్నారు. అయితే, ఈశ్వరచారి భార్య కవిత చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. మల్లన్న ఆర్థిక సాయం చేసిన వీడియోను వైరల్ చేయడం వల్లే తన భర్త మనస్థాపానికి గురయ్యాడని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఒక ఆడియో ద్వారా వెలుగులోకి రాగా.. దానిపై మల్లన్న వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

కవిత ఆడియో చూపించడంతో మల్లన్న మాటల్లో మార్పు…

Advertisement

ఈశ్వరచారి భార్య కవిత ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో.. బిగ్ టీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మల్లన్న ప్రవర్తన భిన్నంగా కనిపించింది. ఇంటర్వ్యూ ప్రారంభ సమయంలో లేని అభిప్రాయం, కవిత ఆడియో గురించి ప్రశ్నించగానే మల్లన్నలో వచ్చింది. బిగ్ టీవీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. నిజంగా ఆ మీడియా సంస్థపై మల్లన్నకు వ్యతిరేక భావన ఉంటే, అసలు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కవిత ఆడియోలో లేవనెత్తిన కీలక విషయానికి సమాధానం చెప్పుకోలేకనే మల్లన్న బిగ్ టీవీపై నిందలు వేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

చిన్న సాయంతో పెద్ద క్రెడిట్ కు ప్రయత్నం..

Advertisement

ఆర్థిక సాయం చేసిన వీడియోను వైరల్ చేసి, దాని ద్వారా కొండంత క్రెడిట్ కొట్టేయడానికి మల్లన్న ప్రయత్నించారనే ఆరోపణ ఈశ్వరచారి భార్య కవిత నుంచి వచ్చింది. అయితే.. ఆ వీడియో చూసి బంధువులంతా అవమానించారని ఈశ్వరచారి భార్య చెప్పిన విషయం వాస్తవం కాదా? అని పలువురు మల్లన్నను ప్రశ్నిస్తున్నారు. ఈ అవమానం నుంచే ఈశ్వరచారి తీవ్ర మనస్థాపానికి గురయ్యారని కవిత ఆడియో స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి మల్లన్న బీసీల అంశాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆడియోలో కవిత చెప్పిన విషయాలు వాస్తవాలేనని.. వాటికి వివరణ ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అడ్డం పెట్టుకోవడం సరికాదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆడియోలో ఏముందంటే…?

ఇది మల్లన్న తీరు…

ఈశ్వరచారి భార్య ఆడియోపై ప్రశ్నించడానికి ముందు ఒక విధంగా.. ఆ తర్వాత మరో విధంగా మల్లన్న ప్రవర్తించారు. ఆర్థిక సాయం చేసిన వీడియోను మల్లన్న వైరల్ చేయడమే ఈశ్వరచారి మనస్థాపానికి కారణమైందనే ఆరోపణలపై మల్లన్న సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఇక మీడియా రంగంలో పని చేస్తూ.. ఓ మీడియా సంస్థనే బొందలో పెడతానని మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పలువురు జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న బుద్ధి తెచ్చుకోకపోత.. భారీ మూల్యం చెల్లించక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. బీసీల సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే మల్లన్న ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

ALSO READ: Teenmar Mallanna: బయటపడ్డ తీన్మార్ మల్లన్న డ్రామాలు.. బిగ్ టీవీపై విషం కక్కి.. వితండవాదం

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×