E-Paper
Advertisement

Crime News: బంగారు గుడ్డును మింగేసిన దొంగ.. ‘వెనుక’ నుంచే రికవర్ చేస్తారట, పాపం పోలీసులు!

Crime News: బంగారు గుడ్డును మింగేసిన దొంగ.. ‘వెనుక’ నుంచే రికవర్ చేస్తారట, పాపం పోలీసులు!
Advertisement

Man Swallows Pendant: ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన దొంగతనాలు జరుగుతుంటాయి. తాజాగా న్యూజిలాండ్ లోనూ ఇలాంటి ఓ దొంగతనం జరిగింది. జేమ్స్ బాండ్ మూవీ ఆక్టోపస్సీ ప్రేరణతో రూపొందించిన పరిమిత ఎడిషన్ ఫాబెర్జ్ ఎగ్ లాకెట్ ను ఓ దొంగ మింగేశాడు. నవంబర్ 28న పార్ట్రిడ్జ్ జ్యువెలర్స్‌ లో ఈ సంఘటన జరిగింది. జ్యువెల్లరీ దుకాణంలో ప్రదర్శనలో ఉంచిన ఈ అరుదైన లాకెన్ ను 32 ఏళ్ల నిందితుడు తీసుకొని మింగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిన వస్తువు ఫాబెర్జ్ x 007 ఆక్టోపస్సీ ఎగ్ లాకెట్ అని  జ్యువెలర్స్ ప్రతినిధులు తెలిపారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా 50 మాత్రమే తయారు చేయబడినట్లు వెల్లడించారు.

ఈ ఎగ్ లాకెట్ ధర ఎంత ఉంటుందంటే?

జ్యువెలర్స్ కోర్టుకు సమర్పించిన వివరాల్లో ఆ బంగారు లాకెట్ ధర సుమారు రూ. 17 లక్షలు ఉంటుందని తెలిపింది. ఇది బంగారంతో తయారు చేయబడింది. ఆకుపచ్చ ఎనామెల్ కలిగి ఉంటుంది. 183 వజ్రాలు, 2 నీలమణులను కలిగి ఉంటుంది. లోపల, తెలుపు, నలుపు వజ్రాలను కలిగి ఉంటుంది. ఇది చూడ్డానికి బంగారు ఆక్టోపస్ లా ఉంటుంది.

ఆక్టోపస్సీ సినిమా ప్రేరణతో..

Advertisement

ఈ డిజైన్ 1983 జేమ్స్ బాండ్ చిత్రం ఆక్టోపస్సీని సూచిస్తుంది. ఇందులో ఆభరణాల అక్రమ రవాణా చేస్తారు. ఓ ప్లాట్ లో నకిలీ ఫాబెర్జ్ గుడ్డు ఉంటుంది. గుడ్డు తెరుచుకుని లోపల తెల్ల వజ్రపు సక్కర్స్, బ్లాక్ డైమండ్ ఐస్ తో అలంకరించబడిన 18 క్యారెట్ల బంగారు ఆక్టోపస్ కనిపిస్తుంది. దాన్ని ప్రేరణగా తీసుకుని ఈ గోల్డెన్ ఆక్టోపస్సీని తయారు చేశారు. ఇక ఈ గోల్డెన్ ఎగ్ ను మింగిన విషయాన్ని గుర్తించిన జ్యువెలర్స్ సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వాలతాయ్, అది ఐక్యత కాదు.. అసలు సీక్రెట్ ఇదే!

బంగారు గుడ్డును బయటకు తీసే ప్రయత్నం

Advertisement

ఆ వస్తువు పొట్టలో నుంచి బయటకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. “అతడు అరెస్ట్ అయ్యే సమయంలో వైద్యులకు చూపించాం. ఆపరేషన్ చేయడం కంటే, సహజంగా బయటకు వచ్చినప్పుడు తీసుకోవడం మంచిదని సూచించారు. ఆ బంగారు ఎగ్ కోసం అతడిని పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించాం” అని పోలీసు అధికారి గ్రే ఆండర్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దొంగ కస్టడీలో ఉన్నందను, అతడిని జాగ్రతగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సదరు 32 ఏళ్ల దొంగను నవంబర్ 29న ఆక్లాండ్ కోర్టులో హాజరు పరిచారు. కానీ,  పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ దొంగతనం కేసు విచారణ డిసెంబర్ 8న జరగనుంది. అప్పటిలోగా కడుపులో ఉన్న గోల్డెన్ ఎగ్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసు అధికారులు.

Read Also: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక సంక్షోభం.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా ప్రిడిక్షన్!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×