E-Paper
Advertisement

OTT Movie : 20 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్ దొంగిలించే హీరో… స్మగ్లర్లకు చుక్కలు చూపించే జాలరి

OTT Movie : 20 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్ దొంగిలించే హీరో… స్మగ్లర్లకు చుక్కలు చూపించే జాలరి
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తోంది. హరీష్ కళ్యాణ్ నటించిన ఈ ‘డీజిల్’ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా, ధ్రువ్ విక్రమ్ “బైసన్” ప్రదీప్ రంగనాథన్ “డ్యూడ్” చిత్రాలతో పాటు ‘డీజిల్’ కూడా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా డీజిల్ మాఫియా, రాజకీయ గ్యాంగ్‌ల మధ్య జరిగే పవర్ గేమ్‌ను బలమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో చూపిస్తుంది. ఇంచు మించు ‘పుష్ప’ను తలపిస్తుంది. ఇందులో వాసుదేవన్ అనే వ్యక్తి డీజిల్ దందా చేసి పేదల పక్షాన నిలబడతాడు. ఈ హిట్ మూవీ మరి కొన్ని గంటల్లో ఓటీటీ పట్టా లెక్కబోతోంది. ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

షణ్ముగం ముత్తుసామి దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ యాక్షన్ సినిమా ‘డీజిల్’ ను థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్, ఎస్పి సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఇందులో హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా అతుల్య రవి, పి. సాయి కుమార్, వినయ్ రాయ్, కరుణాస్, వివేక్ ప్రసన్న, సచిన్ ఖేడేకర్, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు. 2025 అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2025 నవంబర్ 21 నుంచి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కానుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ ఉత్తర చెన్నైలోని ఇంధన మాఫియా చుట్టూ తిరుగుతుంది. వాసు (హరీష్ కళ్యాణ్) అనే మత్స్యకారుడు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతాడు. అతను ఆ ప్రాంత ప్రజలకు “రాబిన్ హుడ్” లాగా వ్యవహరిస్తూ, చిన్న చిన్న నేరాలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు అతని పెంపుడు తండ్రి ఇంధన అక్రమ రవాణా ముఠాలో చిక్కుకుంటాడు. దీంతో అతని జీవితం అనుకోకుండా కోట్లాది రూపాయల విలువైన డీజిల్ అక్రమ రవాణా చేసే పెద్ద మాఫియాతో లింక్ అయ్యేలా చేస్తుంది. ఈ అక్రమ వ్యాపారం అనేక మలుపులు తిరుగుతుంది.

Read Also : సౌండ్ వింటే రెచ్చిపోయే మిస్టీరియస్ జీవి… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్

Advertisement

వాసు మొదట్లో మాఫియాలో ఉండి, ఆ తర్వాత వారికి వ్యతిరేకంగా మారతాడు. దీంతో ఈ మాఫియా హెడ్, డీసీపీ మాయావేల్ హెల్ప్ తీసుకుంటాడు. మాయావేల్ నేతృత్వంలోని పోలీసు టీం అతన్ని వెంబడిస్తుంటుంది. ఇక కైమాక్స్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేచిపోతుంది. చివరికి ఇంధన మాఫియాలో చిక్కుకున్న వాసు బయట పడతాడా ? ఆ మాఫియాని ఎలా ఎదుర్కొంటాడు ? వాసుని మాయావేల్ అరెస్ట్ చేస్తాడా ? అనే విషయాలను, ఈ తమిళ యాక్షన్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×