BigTV English

OTT Movie : శోభనం రాత్రి భార్య గురించి బయటపడిన బుర్ర బ్లాస్ట్ అయ్యే నిజం… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : శోభనం రాత్రి భార్య గురించి బయటపడిన బుర్ర బ్లాస్ట్ అయ్యే నిజం… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : థియేటర్ లలో చూడలేని సినిమాలను, ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు మూవీ లవర్స్. భాషతో సంబంధం లేకుండా, స్టోరీ కొంచెం నచ్చినా వదలకుండా చూస్తున్నారు.  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


టెంట్కొట్టా (Tentkotta) లో  

ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘దినసరి'(Dinasari). 2025లో విడుదలైన ఈ సినిమాకి జి. శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సింథియా లౌర్డ్ ప్రధాన పాత్రల్లో నటించగా, రాధారవి, ఎం.ఎస్. భాస్కర్, ప్రేమ్‌జీ అమరన్, వినోదిని వైద్యనాథన్, చామ్స్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సింథియా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై సింథియా లౌర్డ్ నిర్మించారు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. 2025 మార్చి 21 నుండి టెంట్కొట్టా (Tentkotta) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఈ సినిమాకి IMDB లో 5.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

శక్తివేల్ ఒక ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. తన తల్లిదండ్రులు, అక్క గాయత్రీతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అతను తన కుటుంబం కోసం ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తూ, దాని కోసం భారీగా రుణం తీసుకుంటాడు. అంతేకాక అతను స్థానిక వ్యక్తి నుండి అధిక వడ్డీకి డబ్బు అప్పు తీసుకుంటాడు.ఇలా ఉండగా శక్తివేల్‌కు వివాహం కోసం ఒక ప్రత్యేక షరతు పెడతాడు. తన భార్య తన కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే ఉద్యోగంలో ఉండాలి. ఈ షరతు కారణంగా అతని కుటుంబం సరైన సంబంధం కోసం చాలా కష్టపడుతుంది. శక్తివేల్‌కు అప్పులు తీరాడానికి, అతని సహోద్యోగి అర్జున్ ఒక సలహా ఇస్తాడు. అతని సలహా నచ్చి ₹1 కోటి అప్పు తీసుకుని దానిని ఇన్వెస్ట్ చేస్తాడు. ఎక్కువ రాబడి వస్తుందని ఆశిస్తాడు.

అయితే అతని ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అందులో లాభాలు అటుంచి, నష్టాలు వస్తాయి. అతని జీవితం ఇప్పుడు గందరగోళంలో పడుతుంది. ఈ సమయంలో, శక్తివేల్ కుటుంబం అతనికి తెలియకుండా శివాని అనే ఇండో-అమెరికన్ అమ్మాయితో సంబంధం ఏర్పాటు చేస్తుంది. శివాని తమిళ సంస్కృతిని అభిమానించి, తమిళనాడుకు వచ్చిన ఒక దయాగుణం కలిగిన యువతి. ఇప్పుడు శక్తివేల్ తీసుకున్న రుణాలు అతని కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తాయి. ఇక శివానితో ఇతనికి పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఆ తరువాత జరిగే మొదటి రాత్రి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది పెళ్ళికూతురు.  చివరికి ఆమె శక్తివేల్‌ను ఈ సమస్య నుంచి బయట పడేస్తుందా ? లేక అతని పతనానికి సాక్షిగా నిలుస్తుందా ? ఆమె ఇచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పేరెంట్స్ ను కాదని వేరొకరికి కూతురు దత్తత… పోలీస్ ఆఫీసర్ తో ఆటలా? హార్ట్ టచింగ్ మలయాళం మూవీ

Related News

Friday OTT Movies : మూవీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజు ఓటీటీలోకి 26 సినిమాలు..!

OTT Movie : మనుషుల్ని బంకర్లలో దాచి ఇదేం పాడు పని ? దిక్కుమాలిన డెత్ గేమ్స్… బెస్ట్ సర్వైవల్ మూవీ

OTT Movie : ఓరి నాయనో… మనుషుల్ని మటన్ లా ఆరగించే ఊరు… దీనికంటే నరకమే బెటర్

War 2 OTT : ‘వార్ 2’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?

OTT Movie : 800 ఏళ్లుగా ప్రాణాలతో… చావనివ్వని శాపం… గ్రిప్పింగ్ స్టోరీ, అదిరిపోయే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ప్రైవేట్ ఐలాండ్ లో అరాచకం… అమ్మాయిలకే తెలియకుండా ఆ పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

Big Stories

×