Brahmamudi serial today Episode: అప్పు కావ్య దగ్గరకు వెళ్తుంటే రాజ్ వచ్చి మీ అక్కా ఏమైనా కాల్ చేసిందా..? అని అడుగుతాడు. లేదు చేయలేదు అని చెప్తుంది. మనసులో మాత్రం నేను ఇప్పుడు వెళ్లేది అక్క దగ్గరకే బావగారు కానీ మీకు నిజం చెప్పలేను అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో అపర్ణ నాన్నా రామ్ ఆఫోన్ ఏదో నువ్వే చేయ్యోచ్చు కదా అని చెప్తుంది. దీంతో రాజ్ లేదమ్మా నేను తనను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని చెప్తాడు. దీంతో ఇంద్రాదేవి మేము కూడా నిన్ను డిస్టర్బ్ చేయమనడం లేదురా మనవడా..? జస్ట్ ఇలా కాల్ చేసి అలా తెలసుకోమంటున్నాం అంటుంది. సుభాష్ కూడా అవును రామ్ ఒకసారి కాల్ చేయ్ అని చెప్తాడు.
దీంతో రాజ్ లేదు నాన్నా ఇందాక కాల్ చేసినప్పుడు నాతో చాలా కంగారుగా మాట్లాడింది. ఆవిడేదో ముఖ్యమైన పనిలో ఉంటే తప్పా అలా మాట్లాడరు. నేను అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తే చిరాకు పడుతుంది. కళావతి గారిని విసిగించే పనేది నేను చేయను నాన్న అంటాడు. అబ్బో కాబోయే భర్తను బాగానే అర్థం చేసుకుంటున్నావు అంటుంది ఇంద్రాదేవి. దీంత రాజ్ తను మంచి మనసుకు మంచి మాటకు ఎవ్వరైనా మంత్రముగ్దులు అయిపోవాల్సిందే. కళావతి గారు విరబీసిన రోజా పువ్వు లాంటి వారు నాన్నమ్మ. అలాంట రోజా పువ్వును నీళ్లు పోసి మంచిగా చూసుకోవాలి అని చెప్తాడు. రుద్రాణి మాత్రం ఈ రోజు కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయకుండా ఆపాలనుకుంది యామిని ఆపేసింది. పాపం అక్కడ ఆ కావ్య, స్వప్నల పరిస్థితి ఎలా ఉందో అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది.
ఒక రూంలో కావ్య, స్వప్న ఉంటారు. బయట లాక్ చేసి ఉంటుంది. కావ్య, స్వప్న కంగారు పడుతుంటారు. ఇంతలో అప్పు వచ్చి వాళ్లను సేవ్ చేస్తుంది. కావ్య వాళ్లను కాపాడిన ఫ్యామిలీకి థాంక్స్ వెళ్లిపోతారు. కావ్య వాళ్లు వెళ్లిపోయాక రేవతి రూంలోకి వెళ్లి ఏడుస్తుంది. నిజం ఎందుకు చెప్పలేదని రేవతి భర్త అడగ్గానే నేను ఎలా చెప్పగలను అంటూ ఎమోషనల్ అవుతుంది రేవతి. మరోవైపు కారులో వెళ్తున్న స్వప్న ఏడుస్తూ ఒక్క క్షణ గుండె ఆగిపోయింది తెలుసా..? ఇక వాళ్ల చేతికి దొరికిపోయాము చంపేస్తారు అనుకునే సమయానికి కావ్య వచ్చింది కాబట్టి సరిపోయింది అంటుది. దీంతో కావ్య వచ్చింది నేనే అయినా కాపాడింది రేవతి గారు అక్క ఆవిడకు థాంక్స్ చెప్పాలి అంటుంది.
దీంతో స్వప్న ఆవిడకు థాంక్స్ చెప్పేశాము కదా..? మనం ఆలోచించాల్సింది ఆ యామిని గురించి దానికి ఎంత ధైర్యం ఉంటే మన జోలికి వస్తుంది అంటూ కోప్పడుతుంది. దీంతో అప్పు అవును అక్కా మన ముగ్గురి జోలికి వస్తే నరకానికి దానికి టికెట్ వేసేదాన్ని అంటుంది. దీంతో స్వప్న కోపంగా నువ్వు లేటుగా వచ్చావే.. కొంచెం ముందుగా వచ్చి ఉంటే వాళ్లు దొరికే వాళ్లు అంటుంది. దీంతో కావ్య కోపంగా మీరు ఊరుకోండి మరీ దారుణంగా మాట్లాడుతున్నారేంటి అంటూ కావ్య ఇద్దరికీ సర్ది చెప్తుంది. ఆ యామిని చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నేను చెప్పేవరకు సైలెంట్ గా ఉండండి అని చెప్తుంది. ఇంతలో ఇల్లు రాగానే అప్పు, కావ్య, స్వప్నలను దింపేసి యామిని ఇంటికి వెళ్తుంది.
ఇంట్లోకి స్వప్న, కావ్య రాగానే అందరూ కోపంగా చూస్తుంటారు. దీంతో కావ్య ఏంటి అమ్మమ్మ గారు అందరూ నా వంక అలా చూస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి నువ్వు చేసిన పనికి నిన్నుకొట్టేయాలన్నంత కోపం వస్తుంది మాకు అని చెప్తుంది. దీంతో కావ్య ఇప్పుడు మీరు నన్ను కొట్టేంత పని నేనేం చేశాను మామ్మ అని అడుగుతుంది. దీంతో అపర్ణ కూడా కోపంగా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు. నీకు అసలు భయం భక్తి ఉన్నాయా..? వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే భయపడవు. అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు.. వాడు నీకు ప్రపోజ్ చేయాలని ఇంటికి వచ్చాడు. నీకోసం వెయిట్ చేశాడు. కానీ నువ్వు బంగారం లాంటి అవకాశాన్ని వృథా చేశావు అంటూ తిడుతుంది అపర్ణ.
దీంతో స్వప్న ఏడుస్తూ.. యామిని చేసిన పని గురించి తమను రౌడీలు వెంబడించిన విషయం చెప్తుంది. దీంతో అందరూ యామిని ని తిడతారు. పోలీస్ కేసు పెడదామని ఆవేశపడతారు. వారిని కావ్య వద్దని వారిస్తుంది. ఇప్పుడు మనం వెళ్లి కంప్లైంట్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది. మన టైం వచ్చిన్నప్పుడు మనం ఏంటో చూపిద్దాం ఇప్పుడు ఈ విషయం వదిలేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు యామిని ఇంటికి వెళ్లిన అప్పు కోపంగా యామినిని కొడుతుంది. చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?