BigTV English

OTT Movie : పేరెంట్స్ ను కాదని వేరొకరికి కూతురు దత్తత… పోలీస్ ఆఫీసర్ తో ఆటలా? హార్ట్ టచింగ్ మలయాళం మూవీ

OTT Movie : పేరెంట్స్ ను కాదని వేరొకరికి కూతురు దత్తత… పోలీస్ ఆఫీసర్ తో ఆటలా? హార్ట్ టచింగ్ మలయాళం మూవీ

OTT Movie : మలయాళం సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు అభిమనులుగా మారారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అక్కడి నుంచి వస్తున్నాయి. అంతే కాకుండా అక్కడి దర్శకులు తెరకెక్కించే విధానం కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరికొత్త స్టోరీతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో UKలోని కఠినమైన చట్టాలతో ఓతండ్రి  పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


ఓటీటీ ప్లే (OTTplay) లో

ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘బిగ్ బెన్’ (Big Ben). 2024 లో వచ్చిన ఈ సినిమాకి బినో ఆగస్టిన్ దర్శకత్వం వహించారు. ఇందులో అను మోహన్, ఆదితి రవి, వినయ్ ఫోర్ట్, విజయ్ బాబు, మియా జార్జ్, బిజు సోపనం, నిషా సారంగ్ వంటి నటులునటించారు. అనిల్ జాన్సన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా 2024 జూన్ 28న థియేటర్లలో విడుదలై, ఆగస్ట్ 2024 నుండి OTTplayలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా UKలోని చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల వల్ల, ఒక మలయాళ కుటుంబం ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

జీన్ ఆంటోనీ (అను మోహన్), కేరళలో సస్పెండ్ చేయబడిన ఒక పోలీసు అధికారి. తన భార్య లవ్లీ, రెండేళ్ల పాపను కలవడానికి లండన్‌కు వెళ్తాడు. లవ్లీ లండన్‌లో ఉద్యోగం చేస్తూ, అక్కడే నివసిస్తుంటుంది. జీన్ తన కుటుంబంతో సమయం గడపాలని ఆశపడుతుంటాడు. అయితే అక్కడికి వెళ్ళాక జీన్ తొందరపాటు స్వభావం, UK చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. దీని ఫలితంగా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వారి కుమార్తెను తీసుకుంటాయి. వీళ్ళను కాదని వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి పోలీసులు సిద్దపడతారు. ఈ ఘటన జీన్, లవ్లీ జీవితాలను తలకిందులు చేస్తుంది. వాళ్ళు తమ కుమార్తెను తిరిగి పొందేందుకు UK కఠినమైన చట్టాలపై పోరాడాల్సి వస్తుంది.

జీన్ తన కుమార్తెను తిరిగి పొందేందుకు, చట్టపరమైన మార్గాలను విడిచి ఒక డేరింగ్ ప్లాన్‌ను రూపొందిస్తాడు. ఈ ప్లాన్‌లో అతనికి జానీ ఫ్రాన్సిస్, ఒక పోలీసు అధికారి మాథ్యూస్ (చందునాథ్) సహాయం చేస్తారు. ఈ స్టోరీ ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, ఊహించని ట్విస్ట్‌లతో ఒక థ్రిల్లర్‌గా మారుతుంది. జీన్ ప్లాన్ UK కఠినమైన సెక్యూరిటీ వ్యవస్థలతో ఢీకొంటుంది. అతని తొందరపాటు స్వభావం కొన్ని సన్నివేశాలలో సమస్యలను సృష్టిస్తుంది. క్లైమాక్స్‌లో జీన్ చేసే రెస్క్యూ ఆపరేషన్ ఒక ఉద్వేగభరితమైన షోడౌన్‌కు దారితీస్తుంది.చివిరికి జిన్ తన కూతురిని దక్కించుకుంటాడా ? అతడు చేసే రెస్క్యూ ఆపరేషన్ ఏమిటి ? ఎందుకు పాపని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు ? అనే విషయాలను తెల్సుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : హై ఎండ్ రెస్టారెంట్లో డేట్… అమ్మాయి ఫోన్ కు వచ్చే మెసేజులు చూస్తే మైండ్ బ్లాక్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×