BigTV English

OTT Movie : ఈ మూవీ ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది ? గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఈ మూవీ ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది ? గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఇండోనేషియాలో మొదటి కాథలిక్ ఎక్సార్సిజం హారర్‌గా గుర్తింపు పొందిన ‘డామినియన్ ఆఫ్ డార్క్‌నెస్’ సినిమా హారర్ ప్రియుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒక టీనేజ్ అమ్మాయిలో దెయ్యం ఆవహించడంతో ఈ హారర్ స్టోరీ మొదలవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్స్ ఒంటరిగా చుస్తే మాత్రం అంతే సంగతులు. హారర్ కంటెంట్ ఈ సినిమాలో అంత ఘోరంగా ఉంటుంది. ఈ ఇండోనేషియాన్ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

థామస్ తన తల్లి, సిస్టర్‌ను కోల్పోయిన తర్వాత ప్రీస్ట్ పదవిని వదులుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని లేట్ సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ కాలాలో దెయ్యం ప్రవేశించినప్పుడు, ఎక్సార్సిస్ట్ రెండ్రా కు థామస్ సహాయం చేయాల్సి వస్తుంది. కాలా మదర్ మాయాకి కూడా గతంలో ఇలాంటి దెయ్యమే పట్టి ఉంటుంది. ఇప్పుడు ఆదేయ్యం కాలా లైఫ్‌ను థ్రెట్ లో పడేస్తుంది. థామస్, రెండ్రా కలిసి ఈ భూతాన్ని ఎక్సార్సైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ దెయ్యం కాలా లైఫ్ మాత్రమే కాక, ఆమె తల్లి మాయా లైఫ్‌ను కూడా థ్రెట్ చేస్తుంది.

రెండ్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా రిచ్యువల్స్ చేస్తాడు. భూతం కాలా ద్వారా ట్రిక్స్ ప్లే చేస్తుంది. మాయా హాంటింగ్ పాస్ట్ బయటపడుతుంది. ఇది కాలా పాసెషన్‌కు కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్‌లో థామస్, రెండ్రా ఆ దెయ్యాన్ని ఎక్సార్సైజ్ చేస్తారు. కానీ స్టోరీ భయంకరమైన మలుపు తిరుగుతుంది. థామస్, రెండ్రా ఆ దెయ్యం నుంచి కాలాని కాపాడతారా ? ఆ దెయ్యం గతం ఏమిటి ? ఎందుకు కాలాలో ఆవహించింది ? అనే విషయాలను ఈ ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘డామినియన్ ఆఫ్ డార్క్‌నెస్’ (Dominion of Darkness) 2024లో విడుదలైన ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇది బాబీ ప్రసెట్యో దర్శకత్వంలో రూపొందింది. ఇందులో జెరోమ్ కుర్నియా (థామస్/జోహాన్), లుక్మాన్ సార్ది (ఫాదర్ ఆంటన్/రెండ్రా), ఆస్ట్రిడ్ టియార్ (మాయా), లెఆ చియారాచెల్ (కాలా), మకాలా రోజ్ హిల్లీ (సపోర్టింగ్ రోల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 ఫిబ్రవరి 2న ఇండోనేషియాలో విడుదలై, 2024 అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్ తో IMDb 5.6/10 రేటింగ్ పొందింది.

Read Also : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

Related News

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : పెళ్ళైనా తీరని కోరిక… భార్యాభర్తలిద్దరిదీ అదే పరిస్థితి… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : డేటింగ్ యాప్ కోసం అమ్మాయి ఆరాటం… కితకితలు పెట్టే కామెడీ రొమాంటిక్ డ్రామా

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

Big Stories

×