Pak vs Oman : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 160/7 పరుగులు చేస్తే.. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 67 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ డకౌట్ గా వెనుదిరగడం విశేషం. అయూబ్ తో పాటు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో అభిమానులు అంతా పాకిస్తాన్ కి ఒమన్ చుక్కలు చూపిస్తుందనుకున్నారు. కానీ ఒమన్ బ్యాటింగ్ లో తడబడింది.
Also Read : Root : రూట్ సెంచరీ చేయకపోతే న**గ్నంగా నడుస్తా…!
మరోవైపు పాక్ ఓపెనర్ పర్హాన్ 29 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మొహమ్మద్ హారిస్ (66) పరుగులు చేసి కలీమ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా డకౌట్ కావడం విశేషం. హాసన్ నవాజ్ (09), మొహమ్మద్ నవాజ్ (19) పరుగులు చేశాడు. అశ్రఫ్ 08, షాహిన్ అప్రిది 02 పరుగులు చేశారు. 04 ఎక్స్ ట్రా లతో కలిపి 20 ఓవర్లలో మొత్తం 160 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు. ఇక ఛేజింగ్ కి దిగిన ఒమన్ జట్టు ప్రారంభంలో ఛేజ్ చేసేలా కనిపించినప్పటికీ.. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్ ఖలీమ్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో 6, 4 బాది మంచి ఊపులో కనిపించాడు. కానీ స్పిన్నర్ అయూబ్ బౌలింగ్ లో ఓపెనర్లు ఇద్దరూ ఔట్ కావడం గమనార్హం. ఇక ఆ తరువాత స్పిన్, ఫాస్ట్ బౌలర్లు ఒక్కసారిగా దాడి చేయడంతో ఒమన్ జట్టుకుప్ప కూలిపోయింది.
బ్యాటింగ్ లో తడబడ్డా ఓమన్..
ఓమన్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ కాస్త తడబడుతున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా 8.5 ఓవర్లకే 6 వికెట్లు పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా ఒమన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడనుకున్న సమయంలోనే ఔట్ అవుతున్నారు. ఒక్కొక్కరూ క్యూ కట్టారు. మరోవైపు అయూబ్ బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడుతాడని పాక్ మాజీ క్రికెటర్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఒమన్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. టీమిండియా కీలక బౌలర్ బుమ్రా బౌలింగ్ లో కూడా డకౌట్ అవుతాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. యూఏఈతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఒమన్ తో ఘన విజయం సాధించిన పాకిస్తాన్ జట్లు సెప్టెంబర్ 14న తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ పై మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఉత్కంఠ వాతావరణం నెలకొనే విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా అలాంటి వాతావరణమే నెలకొంది. సిటీల కంటే ఎక్కువగా పల్లెటూర్లలో ఈ మ్యాచ్ పై మంచి హైప్ కనిపించడం విశేషం. ఈ మ్యాచ్ కోసం ఊర్లల్లో టీమిండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒమన్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీఫలితం మాత్రం దక్కకపోవడం గమనార్హం.