Disa Patani: బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాలీవుడ్ లోనూ కోలీవుడ్ లో కూడా చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈమె ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్‌లోని ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల అర్థరాత్రి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి.. ఇక శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు తగల్లేదు. అసలు ఈ కాల్పులు ఎందుకు జరిపారు? ఏదైన గొడవలు జరిగాయా? అనేది కాస్త వివరంగా తెలుసుకుందాం..
శుక్రవారం ఉదయం ఆమె ఇంటిపై కాల్పులు జరిపారు రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశా సోదరి ఖుష్బూ పటాని సాధువులను అవమానించడంతోనే ఈ కాల్పులు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ.. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు..
కాల్పులు జరిగడం పై ఇప్పటివరకు పోలీసులకు క్లారిటీ రాలేదు. క్లూస్ టీమ్ అన్నీ రకాలుగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఈ కాల్పులు జరిపింది మేమే అంటూ ఓ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ అనే పేర్లతో హిందీలో లెటర్ రాశారు. ‘సోదరులారా.. ఈరోజు బరేలీలోని దిశా పటాని ఇంట్లో జరిగిన కాల్పులు మేమే చేశాం.. గొప్ప సాదువును ఆమె అవమానించింది. సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించింది. మన సాధువులను అవమానించడం మేం సహించం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మరోసారి ఇలాంటివి జరిగితే చంపేస్తాం అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి దీనిపై పోలుసులు ఎలా స్పందిస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక దిశా పటాని సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది.