OTT Movie : థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో థియేటర్లలో విడుదలైన ఒక కొరియన్ మూవీ, మొదటి రోజు 3.6 లక్షల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. నాలుగు రోజుల్లో 18 లక్షల వ్యూస్ తో బ్రేక్-ఈవెన్ పాయింట్ చేరుకుని, బాక్స్ ఆఫీస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కొరియన్ థ్రిల్లర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీలో ఒళ్ళు జలదరించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలను చూడాలంటే గుండె కాస్త గట్టిగా కూడా ఉండాలి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుసుకుందాం పదండి.
సాంగ్-హూన్ ఒక సామాన్యమైన సాలరీమాన్. తన భార్య సూ-జిన్ కుమార్తెతో కొత్త అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తుంటాడు. ఒక రాత్రి వర్క్‌ప్లేస్ పార్టీ తర్వాత ఇంటికి తాగి వచ్చిన సాంగ్-హూన్, బాల్కనీ నుండి ఒక స్త్రీ ఆర్తనాదం విని అటువైపు చూస్తాడు. టే-హో అనే వ్యక్తి ఆమెను సుత్తితో కొడుతున్న దృశ్యాన్ని చూస్తాడు. సాంగ్-హూన్‌ను టే-హో గమనించి, అతనికి కంటి సైగలతో వార్న్ చేస్తాడు. భయంతో సాంగ్-హూన్ లైట్ ఆఫ్ చేసి, పోలీసులకు చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటాడు. మరుసటి రోజు ఆ స్త్రీ మృతదేహం పోలీసులు గుర్తిస్తారు. డిటెక్టివ్ జే-యోబ్ ఈ కేసును విచారిస్తాడు. సాంగ్-హూన్ భయం వల్ల ఏమీ చెప్పడు. కానీ అపార్ట్‌మెంట్‌లోని ఇతరులు కూడా హత్యను చూసినప్పటికీ నిశ్శబ్దంగా ఉంటారు.
ఈ సమయంలో సాంగ్-హూన్ కుటుంబాన్ని టే-హో టార్గెట్ చేయడం ప్రారంభిస్తాడు. అతను సాక్ష్యం చెప్పకుండా చూడటానికి చంపడానికి ప్రయత్నిస్తాడు. సెకండ్ హాఫ్‌లో టే-హో మరో సాక్షిని హత్య చేస్తాడు. సాంగ్-హూన్ భయం మరింత తీవ్రమవుతుంది. డిటెక్టివ్ జే-యోబ్ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. సాక్షాలు లేకపోవడంతో పోలీసుల పని కష్టంగా మారుతుంది. సాంగ్-హూన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ టే-హో అతని ఇంటికి చేరుకుంటాడు. సాంగ్-హూన్ భార్య సూ-జిన్ ధైర్యంగా టే-హోను ఎదుర్కొంటుంది. ఆ తరువాత సాంగ్-హూన్ అతన్ని ఒక అడవిలోకి ఛేజ్ చేస్తాడు. ఈ ఛేజ్ ఎలా జరుగుతుంది ? కిల్లర్ ఏమవుతాడు ? ఇక ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘ది విట్‌నెస్’ (The Witness) 2018లో విడుదలైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. జో క్యూ-జాంగ్ దర్శకత్వంలో నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో లీ సంగ్-మిన్ (సాంగ్-హూన్), కిమ్ సాంగ్-హో (డిటెక్టివ్ జే-యోబ్), జిన్ క్యుంగ్ (సూ-జిన్, సాంగ్-హూన్ భార్య), క్వాక్ సి-యాంగ్ (టే-హో, కిల్లర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018ఆగస్టు 15 థియేటర్లలో విడుదలై, 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో,ప్లెక్స్‌లో కొరియన్‌లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది
Read Also : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్