BigTV English

OTT Movie : దెయ్యాల జోలికి వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కే పూజారి … ఈ ఇండొనేషియన్ సినిమాని చూడాలంటే చాలా గట్స్ ఉండాలి

OTT Movie : దెయ్యాల జోలికి వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కే పూజారి … ఈ ఇండొనేషియన్ సినిమాని చూడాలంటే చాలా గట్స్ ఉండాలి

OTT Movie : ఒక ట్రాజిక్ యాక్సిడెంట్‌లో తన తల్లి డయానా, సోదరి డయాండ్రాను కోల్పోయిన యంగ్ కాథలిక్ ప్రీస్ట్ ఫాదర్ థామస్, తన విశ్వాసంపై సందేహంతో ప్రీస్ట్ పదవిని వదిలేయాలనుకుంటాడు. కానీ అతని లాస్ట్ టాస్క్‌గా, ఆరోగ్యం క్షీణిస్తున్న ఎక్సార్సిస్ట్ ఫాదర్ రెండ్రాతో కలిసి, థామస్ లేట్ సిస్టర్ కు ఫ్రెండ్ అయిన కైలాను ఆవహించిన డెమన్‌ను ఎక్సార్సైజ్ చేయమని ఆర్డర్ వస్తుంది.  ఈ డెమన్ నిజంగా కైలాను టార్గెట్ చేసిందా ? థామస్ తన విశ్వాసాన్ని రీడిస్కవర్ చేసి కైలాను సేవ్ చేయగలడా ? ఈ డెమన్ అందరినీ డిస్ట్రాయ్ చేస్తుందా? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ రియల్-లైఫ్ ఎక్సార్సిజం కేసుల నుండి ఇన్స్పైర్ అయింది. సంతా మరియా లారెన్సియా కాన్వెంట్ స్కూల్‌లో టీచర్ గా ఫాదర్ థామస్ పనిచేస్తుంటాడు. తన తల్లి డయానా, సిస్టర్ డయాండ్రాను ఒక రోడ్ యాక్సిడెంట్‌లో కోల్పోతాడు. ఈ ట్రాజెడీ అతని దైవ విశ్వాసం మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.  అతను ప్రీస్ట్‌గా రిజైన్ చేయాలనుకుంటాడు. కానీ ఇంతలోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎక్సార్సిస్ట్‌తో జాయిన్ అవ్వమని ఫాదర్ రెండ్రా నుంచి పిలుపు వస్తుంది. కైలా అనే టీనేజర్‌ను ఎక్సార్సైజ్ చేయడానికి ఫాదర్ థామస్, రెండ్రాతో కలసి అక్కడికి వస్తాడు.


కైలా థామస్ లేట్ సిస్టర్ డయాండ్రా బెస్ట్ ఫ్రెండ్. ఆమెలో ఒక దెయ్యం ఆవహించి ఉంటుంది. దీనివల్ల అక్కడ భయంకర సంఘటనలు జరుగుతుంటాయి. కైలా తల్లి మాయా ఒక సింగిల్ మదర్. తన గతంలో డార్క్ సీక్రెట్స్‌తో, గిల్ట్‌తో స్ట్రగుల్ అవుతోంది. ఆమె యంగ్ ఏజ్‌ ఉండగానే కైలాకు జన్మనిచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో ఒంటరిగా బతుకుతోంది. అక్కడ  కైలా పొసెషన్, మాయా గతంతో కనెక్ట్ అయి ఉందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక థామస్, రెండ్రా ఎక్సార్సిజం స్టార్ట్ చేస్తారు.

ఫస్ట్ ఎక్సార్సిజంలో రెండ్రా డగల్‌ అనే డీమన్ ను ఎక్స్‌పెల్ చేస్తారు. అయినా కూడా కైలా ఫుల్లీ రికవర్ కాదు. కైలా డైరీలో డార్క్ థాట్స్ గురించి తెలుసుకుంటుంది మాయా.  మరో వైపు కైలా లోపల ఇంకా స్ట్రాంగెస్ట్ డెమన్ ఉందని తెలుస్తుంది. ఎక్సార్సిజం చేసేటప్పుడు రెండ్రా డెమన్ వల్ల తీవ్రంగా గాయపడి హాస్పిటలైజ్ అవుతాడు. ఇక థామస్ ఒంటరిగా, సెకండ్ ఎక్సార్సిజం పెర్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. చివరికి కైలా పొసెషన్ వెనుక రియల్ కాజ్ ఏమిటి ? మాయా డార్క్ పాస్ట్ డెమన్‌తో ఎలా కనెక్ట్ అయింది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మనుషుల రూపంలో ఉండే మాన్స్టర్స్… అమ్మాయిలను ట్రాప్ చేసి… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ ఇండోనేషియన్ హర్రర్ సినిమా పేరు ‘Dominion of Darkness’. 2024 లో వచ్చిన ఈ సినిమాకి బాబీ ప్రసేత్యో దర్శకత్వం వహించారు. ఇది ఇండోనేషియాలో కాథలిక్ ఎక్సార్సిజం థీమ్‌తో తొలి చిత్రంగా గుర్తింపు పొందింది. The Exorcist వంటి హాలీవుడ్ క్లాసిక్స్ నుండి ప్రేరణ పొందింది. ఇందులో జెరోమ్ కుర్నియా (ఫాదర్ థామస్),లుక్మాన్ సర్డి (ఫాదర్ రెండ్రా), ఆస్ట్రిడ్ టియార్ (మాయా), లీ కియరాచెల్ (కైలా), ఫ్రెయా (JKT48), డెలియా హుసేన్ (సపోర్టింగ్ రోల్స్) వంటి నటులు నటించారు. యూట్యూబ్ (Youtube) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×