BigTV English
Advertisement

Tortoise: ఈ తాబేలుకు ఎప్పుడూ అదే పని.. 800 పిల్లలకు తండ్రి, దానికో కారణం ఉందట!

Tortoise: ఈ తాబేలుకు ఎప్పుడూ అదే పని.. 800 పిల్లలకు తండ్రి, దానికో కారణం ఉందట!

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి. అలాంటి వాటిలో ఎస్పానోలా జెయింట్ తాబేళ్లు కూడా చేరిపోయాయి. 1960లలో ఈ తాబేళ్ల జాతి దాదాపు అంతరించే స్థితికి చేరాయి. వీటిని కాపాడేందుకు పర్యావరణవేత్తలు ఎంతో కృషి చేశారు. ఫలితంగా ఆ జాతి ఇప్పుడు భూమ్మీద నిలబడింది. ఆ జాతిని కాపాడ్డంలో డియోగో అనే తాబేలు కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఈ తాబేలు తన జాతిని కాపాడుకునేందుకు ఏం చేసింది? ఎందుకు ఆ తాబేలు గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఈక్వెడార్ లో నివసించే అరుదైన తాబేలు జాతి

ఎస్పానోలా జెయింట్ అనే తాబేళ్ల జాతి ఈక్వెడార్‌ లోని  గాలపాగోస్ దీవులలో ఉంటుంది. అదీ ఎస్పానోలా ద్వీపంలో మాత్రమే నివసిస్తుంది. 1960 సమయంలో ఈ జాతి తాబేళ్లు అంతరించే స్థితికి చేరాయి. ఆ ద్వీపంలో కేవలం 15 తాబేళ్లు మిగిలాయి. వాటిలో 12 ఆడ తాబేళ్లు కాగా, మూడు మగ తాబేళ్లు. నిజానికి తిమింగళాలు వీటిని ఆహారంగా తీసుకునేవి. నావికులు కూడా వేలాది తాబేళ్లను ఆహారం కోసం తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ ద్వీపంలోకి మేకలు రావడంతో ఈ తాబేళ్లు తినే మొక్కలన్నింటినీ అవి తినేశాయి. ఫలితంగా ఆహారం లభించక చాలా తాబేళ్లు అంతరించిపోయాయి. చివరకు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి.


అరుదైన తాబేళ్ల జాతిని కాపాడే ప్రయత్నం

ఎస్పానోలా జెయింట్ తాబేళ్లను కాపాడటానికి గాలపాగోస్ నేషనల్ పార్క్, చార్లెస్ డార్విన్ ఫౌండేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.  వీటిని కాపాడేందుకు బందీ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించాయి. మిగిలిన తాబేళ్లను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాటికి చక్కటి ఆహారాన్ని అందించడంతో పాటు పునరుత్పత్తి చేయగల పరిస్థితిని క్రియేట్ చేశారు. అక్కడ పుట్టిన పిల్లలను మళ్లీ సముద్రంలోకి విడుదల చేయాలనుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన తాబేళ్లలో ఒకదానికి డియెగో అని పేరు పెట్టారు.  ఈ తాబేలు చాలా సంవత్సరాలుగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో జూలో ఉంది.  1977లో తాబేళ్ల  పెంపకం కార్యక్రమంలో చేరడానికి డియెగోను గాలపాగోస్‌ లోని శాంటా క్రజ్ ద్వీపానికి తరలించారు.

 800 తాబేళ్లకు తండ్రిగా..

డియెగో అత్యంత చురుకైనా బ్రీడర్ గా మారింది. తన జాతికి తిరిగి జీవం పోసేందుకు కీలక సాయం చేశాడు. DNA పరీక్ష ద్వారా డియెగో దాదాపు 800 నుంచి 900 తాబేలు పిల్లలకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. సుమారు 40 ఏళ్ల పాటు తన జాతి తాబేళ్ల జననానికి ఈ తాబేలు సాయపడింది.ఆ తర్వాత ఈ తాబేలును ఎస్పానోలా ద్వీపంలో సురక్షితంగా వదిలేశారు. ఆ తర్వాత ఈ తాబేళ్ల సంఖ్య 15 నుంచి 2,000 కు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ తాబేళ్లలో ఎక్కువ భాగం ఇప్పుడు ఎస్పానోలా ద్వీపంలోని  సురక్షితంగా నివసిస్తున్నాయి. డియోగో ప్రపంచ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన జాతిని  అంతరించిపోకుండా కాపాడిన సంరక్షణ వీరుడిగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికీ ఆ తాబేలు సుక్షితంగా ఎస్పానోలా ద్వీపంలో ప్రశాంతంగా నివసిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Read Also: భయపెడుతోన్న జులై 5.. టికెట్లు క్యాన్సల్ చేసుకుంటోన్న జనం!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×