Virat Kohli : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటు మరో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. దీంతో 25 ఏళ్ల కుర్రాడు శుబ్ మన్ గిల్ తన భుజాలపై బాధ్యత వేసుకున్నాడు. భారత టెస్ట్ కెప్టెన్ గా ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లాడు. గిల్ కి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్సీ వ్యవహరించిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే తాజాగా భారత జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు గిల్ 2024లో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో నాలుగు మ్యాచ్లు గెలిచింది భారత జట్టు. ఒక్క మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. దాదాపు 80 శాతం గెలుపు రేటుతో నాయకత్వ లక్షణాలు.. ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యానికి బలమైన ప్రారంభ సంకేతం ఇచ్చాడు.
Also Read : Temba Bavuma : బుడ్డోడు బుడ్డోడు అన్నారు.. ఆస్ట్రేలియా గుడ్డలు విడదీసి కొట్టాడు!
ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ఆగస్టు 2025 వరకు జరుగనుంది. హెడ్డింగ్లీ(లీడ్స్), ఎడ్జ్ బాస్టన్ (బర్మింగ్ హామ్), లార్డ్స్ వంటి దిగ్గజ స్టేడియాల్లో ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఓవల్ (లండన్), ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్)లో నాలుగో టెస్ట్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు పార్టీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో రాత్రి అంతా అక్కడే గడిపి టీమిండియా ఆటగాళ్లు అనుష్క శర్మ ఇచ్చిన పార్టీకి చిందులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాటింగ్ దిగ్గజాలు లేకుండా అసలు ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలుస్తుందా..? అని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మాత్రం గెలిస్తే.. గిల్ క్రెడిట్ అంటారు. పొరపాటున ఓడిపోతే మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం వల్లనే టీమిండియా ఓటమి రుచి చూడాల్సి వచ్చిందని కచ్చితంగా చర్చించుకోవడం మనం తప్పకుండా చూస్తాం. చాలా వరకు విరాట్ కోహ్లీ+రోహిత్ శర్మ కలిస్తే.. గిల్ అని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గిల్.. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి చాలా నేర్చుకున్నాడు. కానీ చాలా వరకు తన ఆటపై సొంత ముద్ర వేస్తాడని వెల్లడించాడు బట్లర్.