OTT Movie : ఒలివియా విన్‌ఫీల్డ్ తన తండ్రి వ్యాపారంలో సంతోషంగా పనిచేస్తూ, స్వతంత్ర జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక రోజు ఒక హాండ్సమ్ అబ్బాయి మాల్కం ఫాక్స్‌వర్త్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక అతను ఒలివియాతో ఏకాంతంగా గడుపుతాడు. ఆమె కలల జీవితం త్వరలోనే ఒక కలల రాత్రిగా మారుతుంది. మాల్కం దురుద్దేశాలు ఒక్కొక్కటి బయటపడతాయి.ఆమె జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.ఇక ఒలివియా ఈ చీకటి ప్రపంచంలో ఎలా మనుగడ సాగిస్తుంది? ఆమె ఒక బాధితురాలిగా మిగిలిపోతుందా ? భవిష్యత్తులో ఆమె ఎలా మారుతుంది? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ 1920లో మొదలవుతుంది. ఒలివియా విన్‌ఫీల్డ్ తన తండ్రి షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తూ, స్వతంత్ర జీవితం గడుపుతోంది. ఆమె తండ్రి ఆమెకు వివాహం చేయాలని కోరుకుంటాడు. మాల్కం ఫాక్స్‌వర్త్‌ను ఆమెకు పరిచయం చేస్తాడు. మాల్కం చార్మ్‌కు ఆమె ప్రేమలో పడిపోతుంది. ఒలివియా అతన్ని వివాహం చేసుకుని ఫాక్స్‌వర్త్ హాల్‌కు వెళ్తుంది. ఫాక్స్‌వర్త్ హాల్‌లో, ఒలివియా త్వరలోనే మాల్కం నిజమైన స్వభావాన్ని తెలుసుకుంటుంది. అతను క్రూరమైన, మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యక్తి. మాల్కం తనం సవతి తల్లి అలిసియాతో అసహజమైన సంబంధం కలిగి ఉంటాడు. ఇది ఒలివియా జీవితాన్ని మరింత ఇబ్బందికి గురిచేస్తుంది.
ఒలివియా మాల్కం క్రూరత్వాన్ని, లైం*గిక వేధింపులను ఎదుర్కొంటుంది. ఆమె కలలు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతాయి. ఈ సిరీస్ ఒలివియా పరివర్తనను చూపిస్తుంది. ఒక అమాయక యువతి నుండి కఠినమైన మహిళగా మారుతుంది. ఆతరువాత అలిసియాతో మాల్కం సంబంధం ఒక బిడ్డకు దారితీస్తుంది. ఒలివియా ఈ రహస్యాన్ని కాపాడటానికి ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇది భవిష్యత్తులో Flowers in the Attic సంఘటనలకు దారితీస్తుంది. ఒలివియా తన కుటుంబాన్ని రక్షించడానికి, మాల్కం దుష్టత్వాన్ని ఎదుర్కోవడానికి పోరాడుతుంది. కానీ ఆమె నిర్ణయాలు ఆమెను మరింత చీకటి మార్గంలోకి నడిపిస్తాయి.
Read Also : 16వ పుట్టినరోజున 16 సార్లు పొడిచి చంపే సైకో కిల్లర్ … 35 ఏళ్ల తరువాత అదే సీన్ రిపీట్ …
2022 లో వచ్చిన ఈ సైకోలాజికల్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘Flowers in the Attic: The Origin’. ఈ వెబ్ సిరీస్ 4-ఎపిసోడ్ లతో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి డెక్లాన్ ఓ’డ్వైర్, రాబిన్ షెప్పర్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో జెమిమా రూపర్, మాక్స్ ఐరన్స్, మాల్కం ఫాక్స్‌వర్త్, కెల్సీ గ్రామర్,కేట్ మల్గ్రూ వంటి నటులు నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.