BigTV English

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్
Advertisement

OTT Movie : లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు మాత్రమే గుర్తొస్తారు. వాళ్ళలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్మురేపుతోంది ఈ అమ్మడు. ఆమె కెరీర్ లో చేసిన బెస్ట్ సినిమాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. పైగా సినిమా అంతా రోడ్ ట్రిప్ తోనే ఉంటుంది. అంతేకాదు మైండ్ బెండింగ్ క్లైమాక్స్ తో మూవీ అదుర్స్ అన్పిస్తుంది.


ఆహాలో అందుబాటులో

2022లో రిలీజ్ అయిన తమిళ థ్రిల్లర్ చిత్రం ‘డ్రైవర్ జామున’ (Driver Jamuna). ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌ చేసింది. ఈ విమెన్ సెంట్రిక్ మూవీలో ఐశ్వర్య పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. 120 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవీకి IMDbలో రేటింగ్ 5.4 మాత్రమే ఉంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్. 2022 డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో మాత్రం ఓ మాదిరిగా ఆడింది.ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో లేడీ క్యాబ్ డ్రైవర్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆడుకలం నరేణ్, కవితా భారతి, శ్రీరంజని కథలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పి. కిన్స్లిన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం Aha OTT ప్లాట్‌ఫాం‌లో అందుబాటులో ఉంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…


 

కథలోకి వెళ్తే..

జమున (ఐశ్వర్య రాజేష్) ఒక మధ్యతరగతికి చెందిన అమ్మాయి. తండ్రి చనిపోయాక క్యాబ్ డ్రైవర్‌ గా పని చేస్తూ ఫ్యామిలీని పోషిస్తుంది. ఆమె తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పోషించడమే కాకుండా కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఓరోజు ఆమె క్యాబ్‌ లో ఊహించని విధంగా గూండాలు ఎక్కుతారు. కానీ వాళ్ళు ఆ కారులో జస్ట్ ప్రయాణం మాత్రమే చేయరు. ఆల్రెడీ వాళ్ళు ఇరుక్కుపోయిన డేంజరస్ జర్నీలోకి ఆమెను కూడా లాగుతారు. అంటే గూండాలు ఆమెను ఒక పెద్ద క్రైమ్ లో ఇరికిస్తారు. జమున ఇష్టం లేకపోయినా పరిస్థితులను బట్టి ఆ ప్లాన్‌లో భాగంకాక తప్పదు. ఈ రోడ్ ట్రిప్ లో జరిగే డేంజరస్ జర్నీ, పోలీసులు, గ్యాంగ్స్, ట్విస్ట్‌లు అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. థ్రిల్ మాత్రమే కాదు సస్పెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఇంతకీ ఆమెకు ఈ జర్నీలో ఎదురైన సమస్యలు ఏంటి? వాటి నుంచి ఎలా బయట పడింది ? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

 

Related News

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

Big Stories

×