OTT Movie : దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో తెలుగు సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు పండగ లాంటి సినిమాలు కరువయ్యాయని చెప్పాలి. అలాంటి వారి కోసమే అన్నట్టు మంచు లక్ష్మి సినిమా కరెక్ట్ గా టైంకి దీపావళి టపాసులా ఓటీటీలోకి వచ్చేసింది. రావడమే కాదు ట్రెండింగ్ లో టాప్ లో ఉండి, దుమ్మురేపుతోంది.
సూపర్ నాచురల్ ట్విస్ట్ తో మర్డర్ మిస్టరీగా రూపొందిన మూవీ ‘Daksha: The Deadly Conspiracy’. సస్పెన్స్, హారర్, యాక్షన్ మిక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీకి వామసీ కృష్ణ మల్ల దర్శకత్వం వ్ వహించగా.. లక్ష్మి మంచు, సినీయర్ నటుడు మోహన్ బాబు, విస్వాంత్ దుడ్డుంపూడి, చిత్రా శుక్ల ప్రధాన పాత్రల్లో నటించారు. రియల్ లైఫ్ తండ్రి కూతుర్లైన మంచు లక్ష్మీ – మోహన్ బాబు కలిసి నటించిన మొట్టమొదటి మూవీ కూడా ఇదే కావడం విశేషం. మంచు అభిమానులకు స్పెషల్ అయిన ఈ మూవీకి IMDb 7.0 రేటింగ్ సాధించింది. అక్టోబర్ 17 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా, ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో టాప్ 10 లిస్ట్ లో ఈ మూవీ కూడా చోటు సంపాదించడం విశేషం. ఆడియన్స్ విశేష ఆదరణతో ‘దక్ష’ మూవీ టాప్ 8 లో ట్రెండ్ అవుతోంది. ఒకవేళ ఇంకా ఈ మూవీని చూడకపోతే ఇప్పుడే ఓ లుక్కేయండి.
ఓ పెద్ద హాస్పిటల్ లో వరుస మరణాలు సంభవిస్తాయి. మిస్టీరియస్ మర్డర్స్ తో కలకలం రేగడంతో దక్ష అనే పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. అసలు ఆ మర్డర్స్ కు గల కారణం ఏంటో తెలుసుకోవడానికి విచారణ మొదలు పెడుతుంది. అంతుపట్టని ఈ కేసులో దక్షకు పాపులర్ సైకాలజిస్ట్ డాక్టర్ విశ్వామిత్ర హెల్ప్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ కేసులో ఊహించని పెద్ద మనుషులు ఉన్నారన్న విషయం బయట పడుతుంది. అంతేకాదు షాకింగ్ గా ఇందులో ఓ సూపర్ నాచురల్ శక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దానివల్ల దక్ష ఇబ్బందుల పాలవుతుంది. అయినప్పటికీ ఈ లేడీ సింగం మర్డర్ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. ప్రాణాలకు తెగించి దక్ష చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా ? అసలు ఆ హాస్పిటల్ లో ఏం జరుగుతోంది ? దక్ష, డాక్టర్ విశ్వామిత్ర కలిసి కనుగొన్న ఆ షాకింగ్ నిజాలు ఏంటి? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే