Parvez Rasool: ఆడింది రెండు అంతర్జాతీయ మ్యాచులే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అవకాశం. కానీ ఆ తర్వాత అతని పేరే వినిపించలేదు. ఇక తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అతను ఎవరో కాదు జమ్మూ కాశ్మీర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్. తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ డేంజర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ ( Parvez Rasool ). గతంలో టీమిండియాలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కానీ అతనికి అవకాశాలు తక్కువ రావడంతో పర్వేజ్ రసూల్ కెరీర్ అంతరించిపోయింది. దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణించిన ఈ ప్లేయర్, 2008 నుంచి ఆడుతున్నాడు. అంటే దాదాపు 17 సంవత్సరాల పాటు మ్యాచ్ ఏదైనా సరే క్రికెట్ లో ఆల్ రౌండర్ పాత్ర పోషించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు ఆడేందుకు చాలా కష్టపడ్డానని, అవకాశాలు రాక చాలా చింతించినట్లు రిటైర్మెంట్ సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు పర్వేజ్ రసూల్.
జమ్ము కాశ్మీర్ కు చెందిన పర్వేజ్ రసూల్ ( Parvez Rasool ) కేవలం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2014 సంవత్సరంలో బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్ళింది. ఆ సమయంలో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు ఈ జమ్మూ కాశ్మీర్ స్టార్ ఆటగాడు పర్వేజ్ రసూల్. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మీర్పూర్ వన్డేలో పర్వేజ్ రసూల్ ఆడాడు. ఈ సందర్భంగా 10 ఓవర్స్ సంధించి, 60 పరుగులు ఇచ్చి ఏకంగా రెండు వికెట్లు తీశాడు. అలాగే 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక టి20 మ్యాచ్ కూడా ఆడిన రికార్డు పర్వేజ్ రసూల్ కు ఉంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన ఈ టి20 మ్యాచ్ లో కేవలం 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. బౌలింగ్ లో 32 పరుగులు ఇచ్చి ఈయాన్ మోర్గాన్ వికెట్ పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత జట్టులో పోటీ, అతని ప్రదర్శన పెద్దగా లేకపోవడం ఇలా అనేక రకాల కారణంగా సెలెక్టర్ల కంటపడలేదు. దీంతో టీం ఇండియాకు దూరమయ్యాడు పర్వేజ్ రసూల్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా ఈ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ దాదాపు మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున బరిలోకి దిగాడు. 2013లో పూణే వారియర్స్ తరఫున కూడా ఆడిన రికార్డు ఇతనికి ఉంది. ఇక ఇప్పటి వరకు తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 352 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?