E-Paper
Advertisement

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌
Advertisement

Survival Thriller: అర్ధరాత్రి ప్రయాణంలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన మహిళకు అక్కడి నుంచి బయట పడటమే పెద్ద సవాలుగా మారుతుంది. కనిపించని చోటు నుంచి ఓ స్నైపర్ ఆమెపై కాల్పులు జరపడం మొదలు పెడతాడు. పారిపోవడానికి దారి లేదు, సాయం కోసం ఎవరిని నమ్మాలో తెలియదు. ఆ దుండగుడు ఎందుకు తననే టార్గెట్ చేశాడో కూడా ఆమెకు అర్థం కాదు. ఒక్క రాత్రిలో ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసే మహిళ కథే ‘నైట్ ఆఫ్ ది హంటెడ్’ (Night of the Hunted). మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో ఉందా లేదా ? అనే విషయాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఆలిస్ అనే మహిళ రాత్రివేళ కారులో ప్రయాణిస్తూ ఓ మారుమూల పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతుంది. సాధారణంగా సాగే జర్నీలో ఇది చిన్న విరామంలా అన్పిస్తుంది. కానీ అదే సంఘటన కాసేపట్లోనే ఆమె జీవితంలో భయంకరమైన రాత్రిగా మారుతుంది. ఎక్కడి నుంచి కాల్పులు వస్తున్నాయో మొదట ఆమెకు అర్థం కాదు. కానీ ఓ స్నైపర్ తనను టార్గెట్ గా చేసుకున్నాడని తెలుసుకున్నాక ఆమె వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

పెట్రోల్ బంక్ చుట్టూ దాక్కోవడానికి పెద్దగా ప్లేస్ ఏమీ ఉండదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కాల్పులకు గురయ్యే ప్రమాదం ఉంది. లోపలే ఉండిపోతే ఆ దుండగుడి నుంచి తప్పించుకోవడం కష్టం. ఫోన్ ద్వారా సాయం కోరడం, అక్కడి పరిస్థితులను గమనించడం, తనను కాపాడుకోగల మార్గాన్ని వెతకడం… ఇలా ఆలిస్ ప్రతి నిమిషం ప్రాణాల కోసం పోరాడుతుంది.

అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదనే విషయం నెమ్మదిగా తెలుస్తుంది. ఆ స్నైపర్‌ కు ఆమెపై ఓ వ్యక్తిగత కక్ష ఉంటుంది. దాని వెనుక ఉన్న కారణం ఆలిస్‌ కు తెలియకపోయినా, ఆ రాత్రి ఆమెను వదిలి పెట్టే ఉద్దేశం అతడికి లేదని స్పష్టమవుతుంది. భయం పెరుగుతున్న కొద్దీ ఆలిస్ తనలోని ధైర్యాన్ని కూడగట్టుకుని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా కనిపించే ఓ ప్రదేశం ఎలా ప్రాణాంతకమైన ఉచ్చుగా మారుతుందో ఈ సినిమాలో చూస్తే వణుకు పుడుతుంది. ఆలిస్ ఆ రాత్రి ప్రాణాలతో బయట పడుతుందా ? ఆమెను టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు ? ఎందుకు ఆమెను చంపాలి అనుకుంటున్నాడు ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవలసిన విషయం.

ఓటీటీలో ఎక్కడ చూడాలి ?

Advertisement

‘నైట్ ఆఫ్ ది హంటెడ్’ 2023లో విడుదలైన ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్. సినిమా జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు. కాబట్టి ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది. ఆలిస్ పాత్రలో కామిల్ రో (Camille Rowe) నటించగా, ఫ్రాంక్ ఖల్ఫూన్ (Franck Khalfoun) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మూవీ మొత్తం ఒకే నైట్ లో జరుగుతుంది. కానీ ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది.

Read Also: గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×