OTT Movie : ఓటీటీలోకి సినిమాల జాతర నడుస్తూనే ఉంది. ఏ భాష సినిమా అయినా సరే ఓటీటీలోకి అడుగు పెట్టేస్తున్నాయి. ఇక అడుగు బయట పెట్టకుండా ప్రేక్షకులు వీటిని ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా, దాదాపు మూడు నెలల తరువాత ఓటీటీ ఆడియన్స్ ని పలకరిస్తోంది. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ విజయంవైపు నడిపించారు. ఈ ఏడాది కన్నడలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అయితే ‘కాంతారా చాప్టర్ 1’ దాన్ని ఓవర్‌టేక్ చేసింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ కన్నడ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎక్కా’. రోహిత్ పడాకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈ సినిమాలో యువ రాజ్ కుమార్, సంజనా ఆనంద్, సంపద, అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ 2025 జులై 18న థియేటర్లలో రిలీజైంది. Sun NXT లో నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని పీఆర్కే ప్రొడక్షన్స్, జయన్నా ఫిల్మ్స్, కేఆర్జీ స్టూడియోస్ బ్యానర్లపై అశ్విని పునీత్, జయన్నా-భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగి రాజ్ నిర్మించారు. ఇది ఐయండిబిలో 7.3/10 రేటింగ్ ని పొందింది.
ముత్తు కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. అతనికి ప్రపంచం అతని తల్లి మాత్రమే. ఒక రోజు అతని చిన్ననాటి స్నేహితుడు రమేశ్, ముత్తు నమ్మకాన్ని ఉపయోగించుకుని, అతని వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని, బెంగళూరులో మంచి లైఫ్ స్టైల్ గడుపుతుంటాడు. ఆ తరువాత ముత్తుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇళ్ళు కూడా అమ్మకానికి వేలం వేసే పరిస్థితి వస్తుంది. డబ్బు ఎలాగైనా తీసుకొస్తానని ముత్తు బెంగళూరుకు వెళ్తాడు. డ్రైవర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అతను ప్రమాదవశాత్తూ నగరంలోని అండర్ వరల్డ్ నేర ప్రపంచంలో చిక్కుకుంటాడు. అతని మొండితనం కారణంగా, అతను స్థానిక గ్యాంగ్‌ల కంట్లో పడతాడు. ఈ ప్రయాణంలో అతను సంజనాతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. ఇది ముత్తు జీవితంలో ఒక ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తుంది.
Read Also : పెళ్ళైన మహిళతో కుర్రాడు… ఐఎండీబీలో 8.8 రేటింగ్… మలయాళ డార్క్ కామెడీ డ్రామా
కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ముత్తుకు తన స్నేహితుడు రమేశ్ కేవలం తనను మాత్రమే కాకుండా, నగరంలోని పెద్ద మాఫియా డాన్‌లతో సంబంధాలు పెట్టుకుని, పెద్ద మోసాలకు పాల్పడ్డాడని తెలుస్తుంది. రమేశ్ కారణంగా అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని, అతను ఒక పెద్ద నేర వలయంలో ఇరుక్కున్నాడని ముత్తుకు అర్థమవుతుంది. ముత్తు తన స్నేహితుడిని పట్టుకోవాలనే వ్యక్తిగత లక్ష్యాన్ని పక్కన పెట్టి, ఆ నేర సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకుంటాడు. చివరికి ముత్తు ఆ అండర్ వరల్డ్ డాన్‌లను ఎలా ఎదుర్కొంటాడు ? స్నేహితుడి మోసానికి ఎలా ముగింపు పలికాడు ? తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు ? తన ఇంటిని దక్కించుకుంటాడా ? అనే దాని చుట్టూ ఈ క్లైమాక్స్ ఉంటుంది. ఈ విషయాలను మీరుకూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ కన్నడ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.