E-Paper
Advertisement

రైలు పట్టాలపై పసివాడి ప్రయాణం… ప్రపంచం మొత్తాన్ని ఏడిపించిన ఒక మాస్టర్ పీస్… ఐయండిబిలో 8 రేటింగ్

రైలు పట్టాలపై పసివాడి ప్రయాణం… ప్రపంచం మొత్తాన్ని ఏడిపించిన ఒక మాస్టర్ పీస్… ఐయండిబిలో 8 రేటింగ్
Advertisement

Emotional Drama OTT : అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. వీటిని చూస్తే గుండె ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ సినిమా బ్రెజిల్ దేశం నుండి వచ్చిన అతిపెద్ద హిట్లలో ఒకటి. దీనికి దాదాపు 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఐయండిబిలో ఈ సినిమాకు ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉంది. ఒక రైల్వే స్టేషన్లో మొదలయ్యే ఈ ప్రయాణం క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోనివ్వదు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బ్రెజిల్ ఎమోషనల్ రోడ్ ట్రిప్ మూవీ పేరు ‘సెంట్రల్ స్టేషన్’ (Central Station). 1998లో వచ్చిన ఈ సినిమాకు అంతర్జాతీయంగా భారీ క్రేజ్ రావడమే కాకుండా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గోల్డెన్ గ్లోబ్, BAFTA వంటి ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ముఖ్యంగా డోరా పాత్రలో నటించిన ఫెర్నాండా మోంటెనెగ్రో, ఆస్కార్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి బ్రెజిల్ నటిగా చరిత్ర సృష్టించింది. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమాకు ‘గోల్డెన్ బేర్’ అవార్డు లభించింది. అంతేకాదు ఈ సినిమాలో పిల్లాడి పాత్ర (జోస్యూ) కోసం దర్శకుడు వాల్టర్ సాలెస్ ఏకంగా 1500 మందిని ఆడిషన్ చేశారు. చివరికి ఎయిర్‌పోర్ట్‌లో షూ పాలిష్ చేసుకునే వినీషియస్ డి ఒలివెరా అనే కుర్రాడిని చూసి సెలెక్ట్ చేశారు. సినిమా అంతా రియో డి జనీరోలోని అసలైన రైల్వే స్టేషన్లలో, బ్రెజిల్ పల్లెటూర్లలో షూటింగ్ చేయడం వల్ల కథలో చాలా రియలిస్టిక్ ఫీల్ కనిపిస్తుంది. ఈ సినిమా prime video, Netflix, Plex ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బ్రెజిల్ లోని రియో సిటీలో ఒక పెద్ద రైల్వే స్టేషన్‌లో డోరా అనే ముసలామె ఉంటుంది. ఈమె పని ఏంటంటే.. చదువురాని అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చెప్పినట్లు వాళ్ల చుట్టాలకి ఉత్తరాలు రాసి పెట్టడం. కానీ ఈమెకి అసలు మనసాక్షి ఉండదు. అందరి దగ్గర డబ్బులు గుంజేసి, ఆ ఉత్తరాలను పోస్ట్ చేయకుండా చెత్తబుట్టలో పారేస్తుంటుంది. అలా ఒకరోజు ఓ తల్లి, తన కొడుకు జోస్యూని తీసుకుని, తనని వదిలేసి వెళ్ళిపోయిన మొగుడికి ఉత్తరం రాయించడానికి డోరా దగ్గరికి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆ తల్లి రైల్వే స్టేషన్ ముందే యాక్సిడెంట్‌లో చనిపోతుంది. దీంతో దిక్కులేని వాడైన ఆ పిల్లోడిని చూసి మొదట్లో డోరాకి ఏమాత్రం జాలి కలగదు. పైగా ఆ పిల్లాడిని తీసుకెళ్లి అక్రమంగా పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌కి ఇచ్చేసి డబ్బులు కూడా తీసుకుంటుంది.

కానీ తర్వాత తన తప్పు తెలుసుకుని, మనసు మారి ఆ గ్యాంగ్ నుండి పిల్లాడిని మళ్ళీ కాపాడి తన దగ్గరికే తెచ్చుకుంటుంది. ఇక లాభం లేదని, ఆ పిల్లాడి తండ్రి అడ్రస్ పట్టుకుని వాడిని వాళ్ల నాన్న దగ్గర చేర్చడానికి డోరా బయలుదేరుతుంది. అలా ఒక ముసలామె, ఒక చిన్న పిల్లోడు కలిసి బ్రెజిల్ అడవుల్లో, పల్లెటూర్లలో చేసే ప్రయాణం మొదలవుతుంది. మొదట్లో ఒకరినొకరు అస్సలు ఇష్టపడని ఈ ఇద్దరూ, ప్రయాణం సాగేకొద్దీ తల్లీకొడుకుల్లా కలిసిపోతారు. దారిలో రకరకాల మనుషులు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గరు. చివరకు ఆ పిల్లోడి తండ్రి దొరుకుతాడా ? డోరా ఆ పిల్లాడిని వదిలి ఉండగలదా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : చిన్నపిల్లల అదృశ్యం… ముప్పై ఏళ్లుగా అంతుచిక్కని మిస్టరీ… బుర్ర గిర్రున తిరిగే స్టోరీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×