E-Paper
Advertisement

నమ్మించి మోసం… క్లైమాక్స్ వరకు క్రేజీగా సాగే భార్యాభర్తల గిల్లికజ్జాలు

నమ్మించి మోసం… క్లైమాక్స్ వరకు క్రేజీగా సాగే భార్యాభర్తల గిల్లికజ్జాలు
Advertisement

Romantic Comedy OTT : మనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు మన గురించి అబద్ధం చెబితే ఎలా ఉంటుంది ? ఒళ్ళు మండిపోతుంది కదా. ఇదే పాయింట్‌ తో ఒక సినిమా సూపర్ హిట్ కూడా అయింది. ఈ కథలో భార్యను మెప్పించడానికి భర్త అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఆ తరువాత స్టోరీ మామూలుగా ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అబద్ధాల వల్ల వచ్చే ఇబ్బందులను చాలా రియలిస్టిక్ గా, నవ్వు పుట్టించేలా చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. భార్యాభర్తల మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ సినిమా పేరు ‘యు హర్ట్ మై ఫీలింగ్స్’ (You Hurt My Feelings). ఈ సినిమాను ప్రముఖ దర్శకురాలు నికోల్ హోలోఫ్సెనర్ తెరకెక్కించారు. కేవలం 1 గంట 33 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, 2023 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా జులియా లూయిస్-డ్రేఫస్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా, రాటెన్ టొమాటోస్‌లో 95% రేటింగ్‌, ఐయండిబిలో 6.5 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్ లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

బెత్ ఒక రచయిత్రిగా ఉంటే, ఆమె భర్త డాన్ ఒక థెరపిస్ట్ గా ఉంటాడు. వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంటుంది. బెత్ తను రాసిన ప్రతి కొత్త కథను ముందుగా తన భర్తకే చూపిస్తుంది. డాన్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా రాశావ్‌ అని ఎప్పుడూ ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటాడు. బెత్ కూడా తన భర్త ఇచ్చే ఆ సపోర్ట్ చూసి చాలా మురిసిపోతుంటుంది. అయితే ఒకరోజు బెత్ తన సోదరితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు, ఒక షాపులో తన భర్త డాన్ తన స్నేహితుడితో మాట్లాడుతుండటం చూస్తుంది. నా భార్య రాసిన కొత్త పుస్తకం నాకు అస్సలు నచ్చలేదు, కానీ తన మనసు ఎందుకు విరగ్గొట్టడం అని అబద్ధం చెప్పానని డాన్ అనడం బెత్ వినేస్తుంది. ఆ మాట విన్న బెత్ ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. తన భర్త ఇన్నాళ్లూ తనతో అబద్ధం ఆడాడని తెలిసి కుంగిపోతుంది. అక్కడి నుండి వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వీటిని చూస్తే మన ఇళ్ళల్లో కొన్ని సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. బంధాలలో ఎదుటివారిని సంతోషపెట్టడానికి చెప్పే చిన్న చిన్న అబద్ధాలు ఎంతవరకు కరెక్ట్? నిజం చెబితే బాధపడతారని అబద్ధం చెప్పడం మంచికేనా? అసలు వీళ్ళ గొడవ చివరికి ఏమయింది ? అనే విషయాల చుట్టూ కథ నవ్విస్తూ ఏడిపిస్తుంది.

Read Also : పోలీసులకే అంతుచిక్కని కిడ్నాప్ కేసు… షాకింగ్ ట్విస్టులతో సాగే క్రైమ్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×