E-Paper
Advertisement

చిన్న పొరపాటుతో హెవెన్ లో ఎర్రర్… దేవుడితోనే డీల్ చేసుకునే క్రేజీ లాయర్

చిన్న పొరపాటుతో హెవెన్ లో ఎర్రర్… దేవుడితోనే డీల్ చేసుకునే క్రేజీ లాయర్
Advertisement

Fantasy Comedy Movie: మనుషులంటే పొరపాటు చేయడం సర్వసాధారణం. కానీ అదే తప్పు దేవుడు చేస్తే… హెవెన్ లో ఎర్రర్ జరిగితే ఏమవుతుంది ? అది కూడా లాయర్ కు అన్యాయం జరిగితే ? ఊరుకుంటుందా… దేవుడైనా సరే చెవులు పిండి మరీ తనకు జరగాల్సిన న్యాయాన్ని జరిగేలా చేసుకుంటుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ‘వండర్‌ఫుల్ నైట్‌మేర్’ (Wonderful Nightmare) అనే కొరియన్ సినిమాలో జరుగుతుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

మరియా లూయిసా “లూయి” మాన్యుయెల్ అనే కొరియన్ అమ్మాయి మన హీరోయిన్. ఎందుకంటే ఇది కొరియన్ సినిమా కాబట్టి. ఆమె సక్సెస్‌ఫుల్ అండ్ సెల్ఫీష్, అహంకారం కలగలిపి ఉన్న టాప్ కార్పొరేట్ లాయర్. డబ్బు, హోదా తప్ప ఆమెకు మానవ సంబంధాల మీద నమ్మకం ఉండదు. ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకు ఇన్వాల్వ్ అయిన రేప్ కేసులో అతనికి అనుకూలంగా వాదించి, గెలిపిస్తుంది కూడా. తరువాత ఆమెకు యూఎస్‌లో ఒక పెద్ద ఉద్యోగ అవకాశం వస్తుంది.

Advertisement

లూయి యూఎస్ ప్రయాణమవ్వడానికి ముందే ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్‌ లో మరణిస్తుంది. ఇంకేముంది ఆమె ఆత్మ పరలోకానికి చేరుకుంటుంది. అక్కడి మేనేజర్ రికార్డులు పరిశీలించి, స్వర్గంలోని ఒక ఎర్రర్ వల్ల అసలు చావాల్సిన లూయి కాకుండా వేరే లూయి చనిపోయిందని, ఈమెకు ఇంకా ఆయుష్షు ఉందని చెప్తాడు. ఈ తప్పును సరిదిద్దడానికి, ఆమె అసలు శరీరం మళ్లీ బ్రతకడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. అంతవరకు లూయి ఒక సాధారణ గృహిణి పాత్రలో భూమిపై జీవించాలని షరతు పెడతారు.

అలా లూయి కళ్ళు తెరిచేసరికి ఒక పేద మధ్యతరగతి ఇంట్లో ఉంటుంది.లగ్జరీ లైఫ్ గడిపిన లూయి, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆల్బర్ట్ భార్యగా మారాల్సి వస్తుంది. వంట చేయడం, ఇల్లు ఊడవడం, పిల్లల గొడవలు, డబ్బులు సరిపోక ఇబ్బంది పడటం వంటివి ఆమెకు నరకంలా అనిపిస్తాయి. మొదట్లో ఆ పేద కుటుంబం నుండి పారిపోవాలని చూసిన లూయి, రోజులు గడిచేకొద్దీ ఆ ఫ్యామిలీ నిష్కల్మషమైన ప్రేమాభిమానాలకు లొంగిపోతుంది. ఈ ప్రయాణంలో ఆమె జీవితం, కుటుంబం విలువను ఎలా తెలుసుకుంది ? ఒక నెల తర్వాత ఆమె తిరిగి తన సొంత బాడీలోకి వెళ్ళిందా ? అనేదే ఈ హృదయానికి హత్తుకునే ఫాంటసీ ఎమోషనల్ డ్రామా కథ.

తెలుగులో

Advertisement

2015లో వచ్చిన హిట్ కొరియన్ ఫాంటసీ రోమ్-కామ్ ఆధారంగా 2026లో ఫిలిప్పీన్స్ భాషలో రీమేక్ అయిన చిత్రం ‘వండర్‌ఫుల్ నైట్‌మేర్’. Netflixలో ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు;లో మాత్రం అందుబాటులో లేదు. ఒకవేళ జీవితం అంటే బోర్ కొడితే ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడండి. మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఇది.

Read Also:  పాత వీడియో టేపులను బాగు చేయడానికెళ్తే బయటపడే పాతిపెట్టిన నిజం… క్లైమాక్స్ కెవ్వు కేక

Tags

Related News

డివోర్స్ తీసుకోబోతున్న భార్య రాత్రికి రాత్రే మిస్సింగ్… గ్రిప్పింగ్ కొరియన్ సిరీస్

వైఫై సిగ్నల్స్ అంటే ఎలర్జీ… ఏ గ్రహం నుంచి వచ్చింది భయ్యా ? జెన్ జీ కిడ్స్ డోంట్ మిస్

ఫహాద్ ను ముప్పుతిప్పలు పెట్టే ముసలావిడ… మస్ట్ వాచ్ మలయాళ ఫీల్-గుడ్ అడ్వెంచర్ కామెడీ డ్రామా

ఒకే ఓటీటీలో రెండు మలయాళం సిరీస్ లు… ఇంకా చూడలేదా ?

బాబోయ్ ఒక్కవారంలో 15 మిలియన్ల వ్యూస్… ఈవారం హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన సిరీస్ ఇదే

పేపర్ లీక్ నిరసనలతో దేశం దద్దరిల్లుతున్న వేళ వివాదాస్పద సిరీస్… టైమ్ చూసి కొడుతున్న జీ5 ఓటీటీ

శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

Big Stories

Advertisement
×