BigTV English

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

చిరుతిండి ఇష్టపడే వాళ్లకు మిక్చర్ చాలా నచ్చుతుంది. నలుగురు కలిసినా, పుట్టిన రోజు పార్టీ అయినా, పార్టీ ఏదైనా మిక్చర్ కచ్చితంగా ఉండాల్సిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టం తింటారు. ఇంట్లో తయారు చేసుకుని తింటే ఫర్వాలేదు. కానీ, బయట కొని తినేవాళ్లు కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే.. ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తయారు చేస్తేరో అర్థం అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే, మళ్లీ బయట తయారు చేసే మిక్చర్ జోలికి వెళ్లరంటే నమ్మండి.


ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే?

తాజాగా మిక్చర్ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తయారీ కేంద్రంలో ఎంత అపరిశుభ్రత నడుమ దీనిని తయారు చేస్తారో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు తన రెండు చేతుల్లో ప్లేట్స్ పట్టుకుని మిక్చర్ ను కలుపుతూ కనిపించాడు. అంతేకాదు, తన కాళ్లతో మిర్చర్ కుప్పమీద నిలబడి ఇష్టం వచ్చినట్లు కలుపుతూ కనిపించాడు. చుట్టూ నీట్ నెస్ లేకపోవడం, మిక్చర్ కలిపే వ్యక్తి కూడా కనీస పరిశుభ్రత పాటించకపోవడం ఇందులో కనిపిస్తుంది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ప్రస్తుతం మిక్చర్ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తాము ఎంతో ఇష్టంగా తినే మిక్చర్ ను ఇంత దరిద్రంగా తయారు చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో చిరుతిళ్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులను కచ్చితంగా మోసం చేయడమే అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తయారీదారులను నమ్మి వారి ఫుడ్ ఐటెమ్స్ తినే వారిని ఇలా మోసం చేయడం నిజంగా దురదృష్టరం అంటున్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన ఫుడ్స్ తయారు చేసే వాళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. “వీలైనంత వరకు బయటి ఫుడ్స్ తినకపోవడం మంచిది. అవి ఎలాంటి పరిస్థితులలో తయారు అవుతాయో తెలియదు. కాబట్టి ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకుని తినడం మంచిది” అని నిపుణులు సూచిస్తున్నారు. “ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇలాంటి ఘటనలకు కనిపించకపోవడం నిజంగా దారుణం” అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.


గతంలో నూడుల్స్ వీడియో వైరల్

ఇక 2024లో ఓ నూడుల్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఓ వేడుకలో నూడుల్స్ తయారు చేసే వ్యక్తి తన రెండు చేతులతో నూడుల్స్ ను కలుపుతూ కనిపించాడు. అంతేకాదు, అతడి చెమట చుక్కలు కూడా నూడుల్స్ లో పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అంతేకాదు, ఓ చేతికి గ్లౌజ్ ఉన్నప్పటికీ, మరో చేతికి ఎలాంటి గ్లౌజ్ లేకుండా అలాగే పిసుకుతూ కనిపించాడు. అప్పట్లో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Read Also: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Related News

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Nun Garba Dance: ‘నన్’ వేషంలో గర్బా డ్యాన్స్.. నెట్టింట వీడియా వైరల్.. ఇదేం పైత్యమంటూ కామెంట్స్

Watch Video: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Indian Arrested: నేరం చేసిన 20 ఏళ్లకు అరెస్ట్.. అమెరికాలో భారతీయుడికి ఊహించని షాక్!

Viral Video: సంస్థలు వేరైనా అందరూ ఒక్కటై.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్స్.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×